మనిషి లో *మనిషి!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.
1.మనిషి,
   పస్తులు పడుకున్నా,వాడి,
   దుస్తులు చిరిగి పోయిఉన్నా,
   అంతస్తులు అసలు లేకున్నా,
    మనిషి లో *మనిషి* భద్రం!
2.మనిషి,
   బహిరంగం రణరంగం,
   ఆలోచన ఉత్తమం,
   అంతరంగం శాంతివనం,
 మనిషి లో *మనిషి* క్షేమం!
3.మనిషి,
  ముఖం బొగ్గయినా,
  మాట అగ్గి అయి,
 హృదయం జ్వలిస్తోంటే!
 మనిషి లో *మనిషి* జయం!
4.చుట్టూ శుభ్రత లేకున్నా,
   మనసు అభిరుచి శుచి!
అది బురద అంటని కమలం,
  మనిషి లో *మనిషి* శుభం!
5.మనిషి శిల!
   లో మనిషి శిల్పం!
   మనిషి మల!
   లో మనిషి కోవెల!
6.మనిషి కర్పూరం,
    లో మనిషి నీరాజనం!
 సర్వులకు దైవదర్శనదర్పణం!
  మనిషి లవణం,లో మనిషి,
     జనఆహారరుచి కారణం!
7.మనిషి శరీరం,
    లో మనిషి *చైతన్యం!*
    మనిషి మరణిస్తాడు!
  చైతన్యంరూపం మారుతుంది!
   మరల మరల జన్మిస్తుంది!