బాలగేయం: - సత్యవాణి
 అమ్మా తమ్ముని చూడమ్మా
అల్లరి  పనులను జేసేను
కుక్క ను రాయితొ కొట్టేను
పిక్కను పట్టగ కుక్కొచ్చె
తూనీగలను పట్టేను
తోకకు ముల్లులు గుచ్చేను
చిటారు కొమ్మలకెక్కేను
తేనె తుట్టను కొట్టేను
తేనెటీగలు కుట్టేను
తోటలలోకి పోయేను 
దొంగగ కాయలు కోసేను
బడిలో అల్లరి చేసేను
పంతులు దెబ్బలు కొట్టేను
తుంటరివాళ్ళను గూడేను
దుడుకు పనులను చేశాను
బుధ్ధిగవుండని చెప్పమ్మా
చెలిమే బలమని తెలుపమ్మా
అల్లరి వద్దని చెప్పమ్మా
అక్కను పోలివుండమను