చీమలు - ఏనుగులూ;-- యామిజాల జగదీశ్
 చీమలు క్రమం తప్పక వరుసగా పోతున్నాయి. ఆ దారిలో ఓ ఆడ ఏనుగు ఓ మగ ఏనుగూ వచ్చాయి. చీమలను చూడగానే ఆడ ఏనుగు ఆగిపోయింది. మగ ఏనుగునీ ఆగమంది. 
"ఎందుకాగాలి?" అడిగింది మగ ఏనుగు.
ఆడ ఏనుగు చెప్పింది "పాపం చీమలు. వాటిని తొక్కకూడదు"
రెండు ఏనుగులూ చీమలమీద కాలు వేయకుండా  ఎంతో జాగర్తగా దాటి వెళ్ళిపోయాయి.
వరుసగా పోతున్న చీమలలో ఒకటి మరొక చీమతో "చూసేవా? మనమెక్కడ కుట్టెస్తామేమోనని భయపడి ఆ ఏనుగులు  పక్కకు తప్పుకుని పోతున్నాయి. పోనీ వెధవ ఏనుగులు" చెప్పింది. 
అప్పుడు మరొక చీమ "పోనీ పాపం....అవీ బతకాలిగా" అంది. 
- తమిళంలో చదివిన మాటలివి

కామెంట్‌లు