ఆటవెలది పద్యాలు
8⃣0⃣6⃣
మంకుపట్టు బట్టి మారాముజేయును
యెంతజెప్ప వినదు యేగలేక
కోపమొచ్చి కొట్ట కొరివి దయ్యమగును
కొరకరాని కొయ్య కొంపలోన
8⃣0⃣7⃣
నిద్రపోదు తాను నిద్రబోనీయదు
నీరుకట్టెవలెను నిక్కబొడుచు
వంటవార్పు మాని వంటింట్ల పడకేయు
తిండి పెట్టలేక తిట్టుచుండు
8⃣0⃣8⃣
మూలమంచమెక్కి మూల్గుతూ పక్కేయు
ఉలుకుపలుకు లేకనూరకుండు
లేప బోయినంత లేచును పైపైకి
కొట్టవచ్చు తాను కోపముగను
8⃣0⃣9⃣
బ్రతిమిలాడి జూడ బామాలి గోరను
కస్సుబుస్సు మనుచు కసురుకొనును యిష్టమొచ్చినట్లు యిల్లంతా చిందర
జేయుచుండునెంతొ చెప్పరోత
8⃣1⃣0⃣
తాళలేడు భర్త తాపెట్టు బాధలు
వదులుకుందమన్న వదలబోదు
మెడకు తగులు పాము మెత్కుముట్ట భయము
కరచి చరచి పాము కాటు వేయు
భార్యా భర్తలు:-వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయి దాస్, సిద్దిపేట.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి