*గాలిపటాలు*: :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 అదుగో అదుగో గాలిపటాలు
మిన్నంతా హరివిల్లైనట్లుగ
ఎన్నోరంగులు విరిశాయీ
రంగురంగుల గాలిపటాలు
నేస్తాలందరు ఎగరేశారు
సూర్యుడు ఎర్రని గాలిపటం
చంద్రుడు తెల్లని గాలిపటం
బోలెడు చుక్కలు గాలిపటాలై
నింగిలొ తేలుతున్నాయి
వేడుకతో నా నేస్తాలందరు
మెరుపు తీగలా అటుఇటు పరుగులు
తీయని మాటలు నవ్వులు పువ్వులు
అంతట నిండెను ఆనందాల వెలుగులు
మా అందరికీ కనువిందులు !!

కామెంట్‌లు