అరటి పండు(బాల గేయం):--ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
పండు నమ్మ పండును
తమలపాకు ఫ్రెండును

గెలలు గెలలు కొంటారు
ఒకటి ఒకటి తీస్తారు
ఆకులు పోకలు అమర్చి
అందులో నన్ను పెడుతారు //పండు//

ముక్కలు ముక్కలు కోస్తారు
దేవుని ముందు పెడుతారు
కొబ్బరికాయ కొడుతారు
చేతులెత్తి మొక్కుతారు //పండు//

పిల్లల పెద్దల

పిలుస్తారు
పసుపు బొట్టు ఇస్తారు
ఆకు వక్క పండును
అందరికీ పంచుతారు //పండు//

అరటి పండును నేను
అందరు మెచ్చే ఫలాన్ని
అమృతంలా ఉంటాను
ఏ కాలమనక ఉంటాను //పండు//