రేడియో/ఎఫ్.ఎం.రేడియో(నానీలు): -డా.రామక‌ కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.
1.మధురకంఠస్వరాలు
    సుమధుర గానాలు
    సామాన్యుడికీ
    వినోదాలు.

2.సుప్రభాతం
    సంస్కృతపాఠం
    సుష్ఠూచ్ఛారణ
    గూట్లో పెట్టె నుండి.

3.చిన్నప్పటి
   మధుర జ్ఞాపకం
   అమ్మతోడుండే
   వంటింటి నేస్తం.

4.మన్ చాహే గీత్ తో
    మది దోచినా,
    స్కైలాబ్ భయాన్ని
    తోసేసిన హీరో.

5.కాలంతో మారి
   చేతిలోకి ఇమిడి
   జాకీలతో మెరిసి
   అస్తిత్వం నిల్పె.

6.ఎఫ్.ఎం లతో
   ఫ్రీక్వెన్సీలతో
  యువతకు చేరువై
  నెట్టింట్లో కూడా నాణ్యమై.

7.గుడిసెలో గుర్తై
   మేడలో చిహ్నమై
   మధుర జ్ఞాపకమై
   రేడియో వెలిగె.

కామెంట్‌లు