దేశమంతా చల్లగుండు:--ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
నిండు నీళ్ళ చెరువులుంటె
పంట చేలు పచ్చ గుండు
పంట లేమో పండు తుంటే
గరిషలన్ని నిండు గుండు

పల్లె లేమో చల్లగుండు
పాడి పంట నిండుగుంటె
కరువు నేమో పారిపోయి
కడుపునిండ తిండి ఉండు

తిండి ఉంటే ఖండ ఉండు
ఖండ ఉంటే బలము ఉండు
బలవంతులు అధికముంటే
దేశమే బలముగా ఉండును