మండుటెండకు తల్లడిల్లే
చిన్నపిట్టకు నీరుపెడదాము
ఎగురలేవిక ఎండలో గింజలేసి
ఆశ్రయo గా ఆదుకుందాము!
గోడ మూలన మెతుకులేస్తే
గొప్ప పుణ్యం దొరకునోయ్
మాట మాటికి పిట్టలొచ్చి
గోలగా తిని పోవునోయ్ !
పొద్దు వాలిన సంజె వేళలో
ముద్దుగా కిల కిలల తో
ల్యాండ్ ఫోన్ తీగలపైన
బారుగా కూర్చున్నవీ !
నీటి చెలమలు మాయమయ్యే
నాగరీకత ముసుగులో
పులుగు పశువుల దాహమెట్లు
తీరునో జర తెలుసు కో !
చిన్ని పాత్రలు నీరు నింపుము
మిద్దె పై ప్రహరీల లో
పరమ పురుషుడు పరవశించే
మంచి కార్యము తెలుసుకో !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి