రైతులు:- పి.చైతన్య భారతి

  ఒక చిన్న గ్రామంలో పాఠశాల విధులు ముగించుకొని సాయంత్రం నగరంలో కూరగాయలు కొందాం అని టీచరు బజారుకి వచ్చింది.ఆ నగరంలో కూరగాయలు అమ్మే మార్కెట్ వసతి లేనందువల్ల రైతులి షాపుల ముందే,రోడ్ పైన అమ్ముకుంటు ఉంటారు.కూరగాయలు కొంటున్న ఆ టీచర్ కు ఉన్నట్టుండి ఏదో శబ్దం వినిపించింది.దగ్గరకు వెళ్లి చూస్తే,అక్కడ కూరగాయలు అమ్ముకునే ఆమె చెప్పుల షాపు అతన్ని బ్రతిమిలాడుతోంది.ఏమైందని టీచర్ అడిగితే ,"చూడమ్మా కూరగాయలన్నీ రోడ్డుపైన చల్లాడు అని ఏడుస్తూ చెప్పింది."ఎందుకని టీచరు షాపు అతన్ని అడుగగా"చూడండి మేడం రోజు షాపుల ముందే పెట్టుకొని అమ్ముతారు,మాకు గిరాకికి అడ్డుగా ఉంటోంది,రోజు ఎంత చెప్పినా విన్పించుకోవట్లేదు ,అందికే ఇలా చేసాను అన్నాడు".అతను కోపంతో ఊగిపోతూ, అప్పుడు ఆ టీచరు పాపం కదారైతులు కష్టపడి పండించి ,నగరానికి తీసుకొచ్చి,ఎండలో కూర్చొని అమ్ముకుంటారు.వారి కష్టం రోడ్ పైన పోసావ్ అన్నది.షాపు అతను "కావాలంటే మీ ఇంటికాడ అమ్మించుకోండి "అని విసుగ్గా మాట్లాడాడు.
అప్పుడు ఆ టీచర్"చూడండి నీవు చెప్పులు తిని బతకలేవు,వారు కష్టపడి పండిస్తేనే నీ కడుపు నిండేది,ఇప్పుడు నీ మీద పోలీసు వారికి కంప్లాంటు  ఇస్తాను,"అని అతన్ని బెదిరించి,"నీ షాపులో చెప్పులన్నీ తీసి రోడ్ పైన ఏస్తే నీకెలా ఉంటుంది?"అని ఆ టీచరు తో పాటు మరో పది మంది గట్టిగా అనే సరికి అతను తప్పు తెలుసుకొని,క్షమించమని,ఇంకెప్పుడు అలా చేయనని మాటిచాడు.
నీతి: రైతులను ఎప్పుడు గౌరవించాలి. చిన్న చూపు చూడరాదు.
కామెంట్‌లు