చెట్టునాటు బాబూ చెట్టునాటు
అదేకదా మన ప్రగతికి మెట్టు
ఆకులోనో, పూవులోనో
కాయలోనో,కాండంలోనో
గుట్టుచప్పుడు చేయకుండ
ఆహారాన్ని మనకోసం దాచుతుంది
మలినమైన గాలిని చప్పున లాగేస్తుంది
శుభ్రమైన గాలిని మిక్కుటంగ ఇస్తుంది
వ్యాధులకు మంచి మందవుతుంది
మనముండడానికి అది గూడవుతుంది
మన ఆకలి తీర్చే కూడవుతుంది
సిగ్గతీర్చ మనకు అది గుడ్డవుతుంది
శుభాలకై పచ్చని తోరణమవుతుంది
దేవుని పాదాలవద్ద పువ్వవుతుంది
పొలాల కోసం అది హలమవుతుంది
మన పనులకోసం పరికరమవుతుంది
ఇంట్లోకి చక్కని వస్తువవుతుంది
కాట్లోకి మననుకాల్చె కట్టె అవుతుంది
చెట్టు కోసం మనమంతా గట్టిపట్టు పట్టాలండీ
చెట్టుచుట్టె మన బతుకులు ఉన్నాయండీ
*చెట్టునాటు*: :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి