********
1.చక్కని రూపురేఖలతో.....కమ్మని అనుభూతిని కలిగిస్తుంది!
2.విటమిన్లతో నిండిపోయి.....అనేక పేర్లతో దొరుకుతుంది!
ద్విపదం:(మామిడిపండు)
********
1.పండ్లలో అది రాజు.
పసుపుపచ్చని వర్ణంలో తియ్యనిరుచులతో అలరిస్తుంది.
2.ఎండాకాలంలో విరివిగా దొరుకుతుంది.
బంగినపల్లి, రసాల రకాల్లో మురిపిస్తుంది.
త్రిపదం:(పండ్లరుచులు)
*******
1.షడ్రుచులతో ఆరోగ్యాన్నిస్తాయి.
పుల్లని,తియ్యని పులకరింతలతో ఆనందాన్ని అందిస్తాయి.
పీచుపదార్థాలు,పోషకాలతో మైమరిపిస్తాయి.
2.చిన్నా,పెద్దా తేడా లేకుండా అలరిస్తాయి.
అనేక రంగుల రాగాలవుతాయి.
ముక్కలు కోసుకొని,తీసిన రసాలతో రూపం మార్చుకుంటాయి.
చతుర్థపదం:(ఆరోగ్యం)
***********
1.శారీరకమైనా,మానసికమైనా స్వస్థత చాలా అవసరం.
నరాలు,కండరాలు,ఎముకల పుష్ఠి ఉండాలి.
సమతుల ఆహారం,వ్యాయామం నియమంగా పెట్టుకోవాలి.
యోగ,ధ్యానం ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
2.వేళకు తిండి,నిద్రలు ఉండాలి.
నడక,మితాహారాలే ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
దురలవాట్లకు దూరం ఉండడం నియమంగా పెట్టుకోవాలి.
సంవత్సరానికొకసారైనా సంపూర్ణ ఆరోగ్యపరీక్షలు చేయించుకోవాలి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి