ఆటలు(నానీలు):-డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.
1.ఉల్లాసం కలిగించి
   ఉత్సాహాన్ని నింపే
   శారీరక‌ వికాసం
   ఆటల్లోనే.

2.జతగూడిన
    జట్టుభావన
    జైత్రయాత్రతో
    జయకేతనం.

3.ఉరుకులెత్తి
    పరుగులు పెట్టి
    గెంతులు వేస్తారు
    కప్పుల కోసం.

4.సాహసాలు చేసి
    సరదాలు పడి
    గాయాలపాలు
    ఆరోగ్య స్పర్థల్లో.

5.వినోదాన్నిచ్చి
   ఉత్కంఠను రేపి
   అనుభూతిని
   కల్గిస్తాయి.


6.జిల్లాస్థాయిలో
    రాష్ట్రస్థాయిలో
    దేశస్థాయిలో
    కీర్తినిస్తాయి.

7.బాల్యం నుంచే
   అలవడాలి
   ఆటవిడుపు కోసం
   అలవాటు చేసుకోవాలి.
కామెంట్‌లు