కోణం: -- జగదీశ్ యామిజాల
ప్రపంచం మహా పెద్దది
అందులో
మనిషి 
మరీ మరీ చిన్నవాడు
- ఇదొక కోణం!

మరీ మరీ చిన్న మనిషికి
ఈ మహా ప్రపంచాన్ని 
కానుకగా ఇవ్వడం అనేది
మరొక కోణం!

ఈ రెండింటిలో
చాలా మంది 
మొదటి దానినీ
అతి తక్కువ మంది
రెండో దానినీ 
ఎంచుకుంటారు