ప్లవ నామ వత్సర యుగాది:--వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయి దాస్, సిద్దిపేట.
శార్వరంత వచ్చి సర్వ నాశము జేసె 
సకల జీవులంత సకల బాధ 
కొత్త వ్యాధి వచ్చి కొంపలే గూల్చెను 
బ్రతక లేక చచ్చె భయముతోన

పాతవత్సరంబు పాటిగా పోయెను 
కొత్త వత్సరంబు కోర్కె ధీర 
పండుగొచ్చినాది ప్లవ నామ వత్సర 
ప్రజలు సంతషించు ప్రభవమగును 

కొత్త వత్సరమున కొంగ్రొత్తగ కరోన 
రూపమెత్తి వచ్చె రూపు మార్చి 
ముక్కు మాస్కు పెట్ట ముదముగా బతికేవు  
మాస్కూలేకయున్న మరణమొచ్చు 

ఆరురుచుల తోడ నారగించ వలెను 
ఆరు గుణములన్ని అనగ ద్రొక్కు 
పంచభక్ష భోజ్య పరమాన్నములనన్ని 
తనివితీర తినుము తపముతోడ 

షడ్రుచులయగాది షడ్రసోపేతంబు 
వగరు తీపి చేదు వంట బట్ట 
కారముప్పు పులుసు కమ్మనీ పచ్చడి 
కడుపునిండ తినగ కమ్మగుండు  


కామెంట్‌లు