అంతరంగం ( జీవితానుభవాలు - మిలిటరీ జీవితం)-కందర్ప మూర్తి , హైదరాబాద్.

 సివిల్ జీవితంలో విధ్యార్థిగా ఆనందంగా ఎంతో అల్లరి చిల్లరగా  తిరిగిన  మాలాంటి యువకులం సైన్యంలో  క్రమశిక్షణ అనే చట్రంలో బంధింప బడ్డాము.

     సైన్యం అంటే ముందుగా  క్రమశిక్షణ , సమయపాలన,
చలాకీతనం , పై అధికారుల ఆదేశాలను పాటించడం చెయ్యాలి.
సైనికుడిగా భారత జాతీయ పతాకం మీద చెయ్యేసి దేశ రక్షణ
కోసం  ఎటువంటి ఆదేశం వచ్చినా  రాత్రైనా పగలైనా భూమి
ఆకాశం సముద్రం యానాలలో దేశరక్షణకు తయారుగా
ఉంటామని  ప్రమాణం చెయ్యాలి.
     ఒకసారి రక్షణదళాలలో యూనిఫాం ధరించిన తర్వాత
మన పౌర హక్కులను కోల్పోవల్సి ఉంటుంది. పని గంటలతో
నిమిత్తం లేకుండా ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడ ఉన్నా
 పై అధికారుల నుంచి పిలుపు వస్తే  ఆపని అమలు జరపాలి.
 ముందు ఆజ్ఞను అమలు పరిచి నీ విజ్ఞప్తిని పై అధికారులకు
 విన్నవించుకోవాలి. కాదు అంటే క్రమశిక్షణ కింద శిక్షార్హుడు.
     ఒకే గొడుగు కింద  భారత జాతీయ పతాక నీడలో  కశ్మీర్
 నుంచి కన్యాకుమారి వరకు గల రాష్ట్రాల వివిధ వేష భాషలు
 సంప్రదాయాలు సంస్కృతి ఆహార పద్దతులతో పుట్టి పెరిగిన
 యువత ఒకే కుటుంబ సబ్యుల మాదిరి కలిసి ఉంటారు.
    శత్రు దేశాల దుశ్చర్యల వల్ల భారత దేశ సరిహద్దుల్లో ఏ
   ఆపద  సంభవించినా  దేశ రక్షణలో ముందుంటారు సైనికులు.
  దేశ రక్షణ తర్వాతే  జన్మనిచ్చిన తల్లి తండ్రులు ,తోబుట్టువులు
 ఆత్మీయులు , భార్య బిడ్డలు.
  ఇరవై సంవత్సరాల లోపునూనూగు మీసాల  నవయవ్వనంతో
 రక్షణ దళాలలో  అడుగు పెట్టిన  సైనికులు దేశ రక్షణ కోసం
  కుటుంబ  సబ్యులకు  దూరంగా  దీర్ఘ కాలం 
 దేశ మంతటా విధులు నిర్వర్తిస్తూ జలప్రళయాలు, భూకంపాలు
 అగ్ని ప్రమాదాలు , సంఘ విద్రోహ శక్తుల దుశ్చర్యలు  ఇలా
 సమాజంలో ఏ ఆపద వచ్చినా పౌర రక్షణ పోలీసు శాఖలకు సహాయ పడుతూంటారు.
   ఆక్సిజన్ అందని   భయంకర మంచు పర్వతాలు, భగభగ
మండే ఎడారి ఇసుక ప్రాంతాలు,  గాలి చొరని  దట్టమైన అడవి
 ప్రాంతాలు, విష సర్పాలు తేళ్లు జలగలు దోమలు విహరించే
 చిత్తడి కొండ ప్రాంతాలతో  కూడిన దేశ  సరిహద్దుల్లో అనేక
 రోగాలతో సతమతమౌతు విధులు నిర్వహణలో ప్రాణాలు
 కోల్పోతున్న అమర వీరులను జ్ఞప్తికి తెచ్చుకోవడం దేశ ప్రతి
 పౌరుని ధర్మం.
       మిలిటరీ ట్రైనింగ్ సెంటర్లో  నియమిత సమయంలో
 రిక్రూట్సుకు  పెరేడ్   ఫిజికల్   వెపన్  ట్రైనింగ్  తోపాటు యుద్ధ సమయంలో తోటి గాయపడ్డ సైనికుల రక్షణ పద్దతులు
 సమయస్ఫూర్తి మేప్ రీడింగ్ వగైరా శిక్షణ ఇస్తారు.
                      *                    *                     *  (మరికొన్ని  సైనిక అనుభవాలు  తర్వాత)
          

కామెంట్‌లు