బంగరు రేకుల బాట
మా బంతిపూల తోట
కన్నులు వెలిగే చోట
పువ్వులు పలికే మాట!
పచ్చ పసుపూ కలిసి
ఆనందంగా మెరిసే
కమ్మని వాసన గాలీ
రమ్మని చిన్నగ పిలిచే !
పైసలు లేవని దిగులు
రైతుకు ఇప్పుడు లేదూ
నాలుగు పువ్వుల గుత్తి
తెలిపే కాసుల శక్తి !
బువ్వకు ఏమిటి లోటా?
గింజలు నిండిన మూట
పువ్వులు నిలిచే కాటా!
పెద్దల పండుగ నాడే
సిద్దము పువ్వుల బండి
ఉగాది వరకూ కాపు
ఉట్టిలో పైకం దాపు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి