భూతప్రేమ(వచనకవిత)డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

 విధాత అద్భుతసృష్టి ప్రాణికోటి
మూగజీవాల జీవవైవిధ్యంతో
ప్రాణమున్న చెట్లతో
సమస్త పర్యావరణంతో అందంగా కనబడుతుంది.
చరాచరాసృష్టిలో జంతువుల కథ,తీర్చలేని వ్యథ.
భూతదయతో దైవం తృప్తి
మనసున్న మనిషికి ఆత్మతృప్తి
పెంపుడు జంతువులైనా,అందమైనవైనా,
అరుదైనవైనా అవి ప్రత్యేకమే.
స్పందనలు,ప్రేమలు,బాధలు
వ్యక్తం చేస్తూ,మన చుట్టూ తిరుగుతూ,ఎంతో విశ్వాసాన్ని
కల్గిఉంటాయి.
ప్రేమతో కళ్ళు చెమరింపజేస్తాయి.
ఆలనా-పాలనా చూస్తే
ప్రాణాలే అర్పిస్తాయి.
బతికే హక్కు వాటికీ ఉంది!
చంపే హక్కు మనకెక్కడిది?
స్వార్థం వీడి,ప్రేమను పంచి
బ్రతకనీయాలి.
జీవవైవిధ్యాన్ని కాపాడాలి.
జంతుప్రేమతో జీవితం సార్థకం
చేసుకోవాలి.
బ్రతకాలి-బ్రతకనివ్వాలి.