మనిషీ
నీకు ముందుండి చనిపోయిన వారందరినీ
ఈ శతాబ్దంలో గెలిచావు,
శుభాభినందనలు!
నీ మేధస్సుతోనూ
నీ తెలివితేటలతోనూ
దూరాన్ని కాలాన్ని కుదించేసావు,
కృతజ్ఞతలు!
ఇక రానున్న శతాబ్దంలో
ఒక్కొక్క మనిషి తలమీదా
ఓ కృత్రిమ గోళాన్ని ఎగరనిస్తావు,
సంతోషం!
మనిషి తాను కోరుకున్నంతవరకూ
మరణాన్ని వాయీదా వేసే మంత్రాన్ని
నువ్వూ కనుక్కొన్నావు
అద్భుతం!
కాంతికిరణాలతో పోటీపడే
వాహనాన్నీ ఉత్పత్తి చేస్తావు,
అమోఘం!
కానీ
ఒక్కటి మాత్రం మరచిపోకు!
మానవత్వాన్నీ, ప్రేమనూ ఉండనివ్వు!
ఈ భూమండలాన్ని ఉండనివ్వు!
మనకు ముందే జీవించిన వారి శ్వాసంతా
ఈ వాయుమండలంలో ఇంకా ఉంది!
ఉండనివ్వు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి