దేశ కాల నైసర్గిక పరిస్ధితులునుబట్టి కళలు ఆవిర్బవించాయి.స్ధానికఆచారవ్యవహారాలకు అనుకూలంగా వాటికి పేర్లు ఏర్పడినవి.ఉదాహారణకు నాగాలాండ్ లోని"లాయిహరేబా"బీహర్ లోని"హూ"ఉత్తరప్రదేశ్ లోని "దివాలి" పంజాబ్ లోని "భాంగ్రా"హిమాచల్ లోని"పంగీచంబో"రాజస్ధాన్ లోని"దాండియరాజ్ -జుమార్"ఒరిస్సాలోని"జాదూ" సౌరాష్ట్రలోని"టిప్పన్ "ఆంధ్రప్రదేశ్ లోని"సిద్దస్ " "లంబాడి" "కూచిపూడి"కెరళ-తమిళనాడులోని "కుమ్మి-కోలాటం" ఇంకా "భరతనాట్యం"కథక్ "మణిపురి "ఒబిస్సా"వంటిపలురకాలపేర్లతో నృత్యాలు పిలవబడుతున్నాయి.
నాట్యాన్ని నవరసభరితంగా అంటే 'శృంగార' 'హాస్య' 'కరుణ' 'రౌద్ర' 'వీర' 'భయానక ' 'బీభత్స' 'అద్బుత''శాంత' రసాలుగా పూర్వికులు చెప్పారు.
ఈనృత్యగీతాలలో ముఖ్యంగా జావళీలో తొణికిసలాడే శృంగారరసంలో "విభావం" "అనుభావం" "స్వాతికభావం" "సంచారిభావం" "అనేవి ఐదుభావాలు.
అలాగేశృంగారచేష్టలు"భావము" "హవము" "హేల" "విలాసము" "మాధుర్యము" "థైర్యము" "విభ్రమము" "లీల" "కిలికించితము" "మొట్టాయితము" "లలితము" "విఛ్ఛిత్తి" "బోబ్బకము" "విహృతము" "చకితము" "హసితము" "కుట్టిమితము" "కుతూహలము"అని పద్దేనిమిదిగా చెప్పబడినవి.
అలాగే ప్రియునితో శృంగారంలో పాల్గోనే ప్రియురాలికి కలిగేఅవస్ధలగురించి తెలుసుకుం!"చక్షుప్రతి" "చింత" "సంస్కృతి" "గుణకీర్తన" "ఆరతి" "తాపము" "లజ్జాత్యాగము" "గమనము" "మూర్చ" "ధన్యత"ఇటువంటి శృంగార రసంతొకూడిన జావళి నృత్యం నయనానందము,మనోఉల్లాసంకలిగిస్తుంది.
నాట్యానికి సంగీతంముఖ్యం.సంగీతానికి సాహిత్యంముఖ్యం ఈమూడింటికి చిత్రశిల్ప సాహిత్య కళాజ్ఞానంముఖ్యం.నాట్యానికి జీవం-భావం.భావ-రాగ-తాళ-భరితం అంటే నటన లేక నృత్యం.ఈనృత్యంగురించి కొంతవివరం తెలుసుకుంద్దాం!
మనభారతీయనృత్యకళని"తాండవం""లాస్యం"అనిరెండుగామనపూర్వికులువిభజించారు. తాండవం పురుషులు,లాస్యం స్త్రీలు ప్రదర్మిస్తారు.లాస్యానికి కర్త పార్వతిదేవి.తాండవానికిమూలపురుషుడు శివుడు.లాస్యం సుందరంగా సుకుమారంగా ఉంటుంది.ఇదిమధురభావప్రకటనకు అనువైనది.దీనికిశృగారరసం ప్రధానమైనది.తాండవంఉధ్ధతమైనది.గంభీరమైనదిదీనికివీరరసంప్రధానమైనది.లాస్యం ఏకపాత్రకేళిక.తాండవం బహుపాత్రల నృత్యనాటకం.
నాట్యానికిఆధ్యుడుఅయినభరతమునికిపూర్వంశంభు,గౌరి,బ్రహ్మ,మాధవుడు,దత్తిలుడు,కోహలుడు,యాజ్ఞవత్యుడు,నారదుడు,హనుమంతుడు,గణపతి,అర్జునుడు,రావణబ్రహ్మ,ఉషకన్య మొదలగువారు ప్రసిధ్ధ నాట్యవేత్తలని మనపురాణాలద్వారాతెలుస్తుంది.
భరతముని 'అమృతమధనం'అనే నృత్యాన్ని శివుని ఎదుట ప్రదర్మించగా తృప్తిచెందిన శివుడు తన శిష్యుడు తండుని పిలిచి భరతమునికి తాండవంలో శిక్షణ ఇవ్వమన్నాడు.అలాభరతముని తననాట్యశాస్త్రంలో తాండవలక్షణ అనే అధ్యాయ చేర్చాడు.స్ధానిక చారీరేచక కరణ అంగాహార మండలక్రమాలు ఈ అధ్యాయనంలో చోటు చేసుకున్నాయి.ఈరీతిని అనుసరించి భారతదేశంఅంతటా అభివృధ్ధిచెందిన నర్తనానే 'మార్గ' నర్తనరీతిఅన్నారు.
ఇదికాకుండా ఆయా ప్రాంతాల ప్రజల అభిరుచులను అనుసరించి శాస్త్రీయంగా అభివృధ్ధిపొందిన నాట్యాని 'దేశి'అన్నారు. రేచక,కరుణ విన్యాసాలతో ఏదైనా ఒక ఘట్టాన్ని ప్రదర్మించడాన్ని 'నాట్యధర్మ'అంటారు.ఓకానొక భావప్రకటన చేయకుండా,సహఒరీతిలోభావాన్నిప్రకటించడాన్ని 'లోకధర్మ'అంటారు.దీన్ని ఆంధ్రులు అభిమానించిఅనుసరించారు.
అష్టవిధనాయకీలుగా "అభిసారిక" "విప్రలబ్ధ" "విరహూత్కంఠిత""సాధ్వినపతిక" "వాసకసజ్జిక" "ప్రాషితభర్తుక" "ఖండిత" "కలహింతరిత"ఇవ్వన్ని ప్రియుని రాక కోసం ఎదురుచూపులు చూసే భామామణులుగా చెపుతారు.ఇంతటి శృంగార రసాన్ని అద్వితీయభావనను తనలో ఇముడ్చుకున్నమనతెలుగు సినిమా జావళి (వంటి)పాటలుకొన్నితెలుసుకుందాం!శృగారప్రధానమైనవాడుకభాషలోరాయబడిన నృత్యంసంగీతంసాహిత్యమే'జావళి'అనేసంగీతగ్రంధంలోచెప్పబడింది.నాయకుడినో,దేవుడినో సంభోదిస్తూ ఉండటాన్ని బట్టి ఇవి స్త్రీల పరంగాఉన్నాయి.
ఈజావళిగీతాలలోశృంగారరసాత్మకంసంయోగవాంఛనువిరహతీవ్రతను,ప్రియునితెంపరితనాన్ని,అతనికొంటెపనులను వర్ణంచడం,అలిగినప్రియుని బుజ్జగించడం.అతని గుణగణాలనురసికతనుప్రస్తుతించడంజావళీలలోప్రధానంగాకనబడుతుంది.'గుళేబకావళికథ'(1962) చిత్రంలో మదనాసుందరనాదొర పాటలో 'మిసిమి వెన్నేలలోన పసిడితిన్నెల పైన రసకేళితేలి పరవశమౌదమివేళ'మిసిమి వెన్నెల శృంగారానికిఉధ్ధీపన.'పూజాఫలం'మదనామనసాయేరా పాటలో సుందరిమధువై ముందునిలిచెరా !అందినపండు అనుభవింపరా! సుందరిఅయిన ఆమగువ మధువైముందునిలిచిందట.శృంగారానికిమధువుతోడైతేకలిగేఅనుభవైకవేద్యమే.'అమరశిల్పిజక్కన్న'(1964)చిత్రంలో అందాలబోమ్మతోఆటాడవా!పాటలో ఎదుట వెన్నెలపంటఎదలోతీయనిమంట.ఎంతచక్కగావిరహవేదననుకవివర్ణించాడు.'ముత్యాలముగ్గు'(1975)చిత్రంలోఎంతటిరసికుడవోతెలిసెరా!పాట.'జయభేరి'(1959) చిత్రంలోనీవెంతనెరజాణఔరా.'సిపాయికూతురు'సరాగములవేళసరసములాడగ. 'జగన్నాటకం'మదనునిఎదిరించు.ఇంకామధురానగరిలో చల్లలమ్మబోదు-మావల్లకాదేయశోదమ్మ-కులములోన గొల్లదాన వయసులోచిన్నదాన-అమ్మయశోదనీకొడుకుదూకుడు వంటి పలుజావళీలు'చిత్తూరుసుబ్రమణ్యపిళ్ళేగారి విరిచితాలు.జావళీలు రెండుసార్లు నిర్మింపబడిన 'త్యాగయ్యచిత్రంలో పల్లవి వరకు.' 'ప్రేమ'(1941)'పతిభక్తి'(1990)'సిరిమువ్వలసింహనాదం'అభిమానం'(1952)చిత్రాలలో కొంతవాడారు.'మోహినిరుక్మాంగద'(1962)చిత్రంలో మనసైనవీరా మనసారరారా!.'రహస్యం'(1967)చిత్రంలోమగరాయవగరాయఈవయ్యరినీసోమ్మురా!.'మంగమ్మశపధం'(1965)చిత్రంలోఅందాలనారాజఅలుకేలరా!.'పిడుగురాముడు'(1966)చిత్రంలోరారాకౌగిలిచేర.'భక్తతుకారాం'(1975)'బోబ్బిలియుధ్ధం'(1964) లో నినుచెరమనసాయరా! సరిసరి వగలుతెలిసర గడసరి.'భక్తప్రహ్లాద'(1967) చిత్రంలో రారా ప్రియసుందరా.'మల్లేశ్వరి' (1951)చిత్రంలో పిలిచినాబిగువటరా!. 'పాండురంగమహత్యం(1957)'చిత్రంలోకనవేరమునిరాజమౌళి.'కన్యాసుల్కం' (1955)సరసుడదరిచేరరా!.'పల్నాటియుధ్ధం'(1964)లోరమ్మంటేరావేమిరా!. 'జరిగినకథ'(1969)లోచినవాడమనసాయరా!'దేవదాసు'(1953)లో ఇంతతెలిసియుండి. 'శ్రీతిరుపతమ్మకథ'(1963)లోకౌగిలికైలాసం...వంటిగీతాలుమనలనుఅలరించాయి.
క్లబ్ సాంగ్స్ ప్రవేశంతో శాస్త్రీయగీతాలు,నృత్యాలు వెనుకబడ్డాయి.నేటి చిత్రాలలో పూర్తిగా ఇవి విస్మరింప బడ్డాయి. జావళీలలోని శృంగార రసికతవర్ణనను విశ్లేషించుకుంటే అంతులేని ఆనంద రసికత గోచరిస్తూంది.
భరతనాట్యం ప్రదర్మనాక్రమంలో'అలరింపు' 'జతిస్వరం' 'శబ్ధం' 'పదవర్ణం' 'పదం' 'జావళి' 'శ్లోకం' 'తిల్లానా' అంశాలుఉంటాయి.'క్షేత్రయ్య'రచించిన కృతులకు-పదాలకు జావళీలు అనిపేరు.ఏదైనా సంగీతం,గానం,నృత్యం మనసుకు శాంతిని అహ్లాదాన్ని కలిగిస్తాయి,అలామన శరీరంలోని నాడులను ప్రభావితంచేసి రోగనివారణకు,మానసిక శక్తిని పెంపోందించడానికి దోహదపడతాయని పరిశోధనలో తేలింది.మానవాళి మహాన్నతకొరకు ఏర్పడిన అపురూప కళలను రక్షించుకోవలసినబాధ్యత మనఅందరిపైనాఉంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి