తాతయ్య కథలు -16. :- ఎన్నవెళ్లి రాజమౌళి

 ఏంటిది నాన్న ఇది. గల్లా పెట్టె. ఇందులో నేను ఇచ్చిన రూపాయలు-అమ్మ ఇచ్చిన రూపాయలు వేసుకోవాలి.
ఈ పెట్టెకు గొళ్ళెం కూడా ఉంది కదా నాన్న.
ఈ గొళ్లెం వేసి, తాళం వేసుకోవాలి. మొత్తం పెట్టె నిండే వరకు-పెట్టె తాళం తీయ వద్దు.
తాత వచ్చినప్పుడల్లా, నాని వచ్చినప్పుడల్లా డబ్బు ఇస్తారు కదా! నాన్న.
అవును! ఆ డబ్బు కూడా ఇందులో వేసుకో. ఇప్పటినుండి పొదుపు చేయ నేర్చుకోవాలి.
అని అమ్మ అనగానే-నేను ఇప్పటి నుండి మీరు ఇచ్చిన  డబ్బు ఇందులో నే వేసుకుంటా గా అని అని అబ్బాయి అనగానే-కొడుకు లో వస్తున్న మార్పుకు తల్లి సంతోషించి-ఆ డబ్బులో సైకిల్ కు కావలసినంత చేర్చి నాన్న నీకు వచ్చే సంవత్సరం దసరాకు గిఫ్ట్ గా సైకిల్ కొనిస్తాడు. అని అమ్మ అనగానే..... చప్పట్టు కొట్టుకుంటూ ఓకే అన్నాడు కొడుకు.