తాతయ్య కథలు-22.:- ఎన్నవెళ్లి రాజమౌళి
 శేఖర్ అమ్మ గారి ఇంటికి వెళ్ళాడు. మనవడు వచ్చాడు అని-రక రకాల కూరలతో పాటు గోంగూర చెట్నీ చేసి పెట్టింది.
కూరలన్నీ ఒక ఎత్తయితే... గోంగూర చట్నీ ఒక ఎత్తయినది. అమ్మమ్మ చేసిన చట్నీ అద్భుతంగా ఉంది.
ఇంటికి వెళ్లగానే... ఈ చట్నీ చేయించుకోవాలని... అమ్మమ్మ ను అడిగాడు. ఇది ఏమి చట్నీ అని-
గోంగూర చెట్నీ అని చెప్పింది అమ్మమ్మ. ఆ పేరు మర్చిపోతానేమో నని-గోంగూర... గోంగూర అనుకుంటూ సైకిల్ ఎక్కాడు.
రెండు కిలోమీటర్లు వెళ్లేసరికి-ఎదురుగా ఒక వ్యక్తి సైకిల్పై వచ్చి-సైకిల్ ను తాకినంత పని చేశాడు.
ఏమయ్యా! కొంచెం అయితే నేను సైకిల్ పై నుండి కింద పడేవాడిని. ఈ దగడు లో చట్నీ పేరు మరిచాడు.
నేను గోంగూర అమ్మడానికి వెళుతున్న కొద్ది సేపు అయితే... నా గోంగూర కిందపడి.. చెల్లాచెదురు అయ్యేది. ఇక నన్నే అంటున్నావా... అన్నాడు.
అయితే వెళ్లవయ్యా వెళ్ళు నేను మరచింది జ్ఞాపకం వచ్చింది. గోంగూర... గోంగూర అనుకుంటూ సైకిల్ ఎక్కాడు శేఖర్.