పద్మశ్రీ కల్లూరి సుబ్బారావు. (మే 25 న జయంతి సందర్బంగా.): డాక్టర్. బెల్లంకొండ నాగేశ్వర రావు

 ఉత్తమ ఆశయం పట్టుదల విషేష కృషి చేసిన వారు తమ జీవితంలో సఫలవంతులు అవుతారు. అలా గణతికెక్కిన మహనీయుడు కల్లూరివిరు అనంతపురం జిల్లా హిందుపురానికి సమీపంలోని కల్లూరిలో పుట్టమ్మ సూరప్ప దంపతులకు 1897 / మే /25 న జన్మించారు.
మదనపల్లి జాతీయ కళాశాలలో 12 వ తరగతివరకు చదివారు.అక్కడ1913లో మదనపల్లిలో అనీబిసెంట్ వారి ప్రసంగానికి ఉత్తేజితులైనారు,అప్పటికి వారి వయసు 17 ఏళ్ళు.అలా వారి  రాజకీయ జీవితం ప్రారంభం అయింది.1914 మద్రాసులో జరిగిన కాంగ్రెస్ మహాసభ లకు కాలినడకన వెళ్ళారు.అదేసంవత్సరం లక్ష్మమ్మగారితో వీరి వివాహం జరిగింది.1919 మహానందిలో జరిగిన ఆంధ్రరాష్ట్ర మహా సభలలో స్వయం సేవకుడిగా పలువురు పెద్దిల మన్ననలు పొందారు.
1921 పెనుగొండ గగన మహల్లో జరిగిన శ్రీకృష్ణ దేవరియలవారి పట్టాభిషేక మహాత్సవంలో దత్తమండలాలకు వీరు'రాయలసీమ' అని నామకరణం చేసి ప్రచారం చేసారు. నేటికి అలానే పిలవ బడుతున్నాయి.1921 ఆగస్టులో సహాయనిరాకరణోద్యమంలో పాల్లోని చెరసాల శిక్ష అనుభవించారు.
1923  సెప్టెంబర్ 30 గాంధీజీ బళ్ళారి వచ్చారు. ఆసభలో పాల్గొన్న కల్లూరివారు అనంతపురం జిల్లా కాంగ్రెసును స్ధాపించారు.రాయలసీమ నుండి రాజకీయఖైదీగా తొలిసారి చెరసాల శిక్ష అనుభవించిందివీరే.
హిందూపూర్ లో దుగ్గిరాల వారి అధ్యక్షతన జరిగిన సభలో  కల్లూరివారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టారు.1923 లో 'లోకమాన్య' అనే మాస పత్రిక ప్రారంభించారు.1942హిందూపురంలో సేవామందిరాన్ని ప్రారంభించారు.అప్పుడే క్విట్ ఇండియా ఉద్యమంలో చెరసాలకు వెళ్ళినపుడు అక్కడ తెన్నేటి,వి.వి.గిరి కరంత్ వంటి విరి పరిచయం కలిగింది.1945 లో జరిగిన శాసనసభ కు ఎంపికై మద్రాసు శాసన సభలో ప్రవేసించిన వీరు విప్ గా పనిచేసారు.
స్వాతంత్ర్యం వచ్చాక రాజ్యాంగ పరిషత్తులో సభ్యునిగా ఎంపిక అయ్యారు. కర్నులు రాజధానిగా గోపాలరెడ్డిగారి మంత్రివర్గంలో శాసనసభ ఉప సభాపతిగా సేవలు చేసారు.1957 లో వీరి సష్టిపూర్తి వేడుకలు అనంతపురంలో ఘనంగా జరిగాయి.1967 లో  డా.సర్వేపల్లి రాథాకృష్ణా గారి చేతులమీదుగా 'పద్మశ్రీ' అందుకున్నారు.అనంతపురంలోని 'లలిత కళా పరిషత్'నిర్మాణానికి స్ధలం దానంచేసారు. రాయల కళా పరిషత్ స్ధాపించి ఎందరో కవి పండిత కళాకారులను సత్కరించారు.ఏటా కృష్ణదేవరాయలవారి పట్టాభిషేక మహోత్సవం నిర్వహించేవారు. లేపాక్షి శిల్ప సంపదను లోకానికి తెలుపడానికి ఎంతో కృషి చేసారు.స్వాతంత్ర్య పోరాటంలో తనజీవిత కాలంలో ఏడు సంవత్సరాలు చెరసాల శిక్ష అనుభవించిన తెలుగు,కన్నడ భాషా పండితుడు తను నమ్మిన సిధ్ధాంతాలకోసం అలుపు ఎరుగని పోరాటంచేసిన నిస్వార్ధ సేవకుడు  కల్లూరి సుబ్బారావు 1973/ డిసెంబర్ /20 వతేదిన తన తుది శ్వాసవిడిచారు.