కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు. కుక్కను మనిషి కరిస్తే వార్త అవుతుంది అన్నాడు రామకృష్ణుడు.
ఈ మాట వినగానే... వెంగళప్ప ముఖము కోటి విద్యుద్దీపాల కాంతితో వెలిగింది. నిజమే... మిత్రుడు అన్నమాట.
కాకపోతే.. నా మిత్రులంతా ఒకరు కవిగా వెలుగొందుతుంటే.. ఇంకొకరు కథా రచయితగా వెలుగొందుతున్నాడు.
ప్రతిరోజు ఏదో రూపంగా వాళ్ల గురించి పేపర్లలో చూస్తున్నాడు వెంగళప్ప.
ఒకరోజు మంచి ముహూర్తం చూసుకుని, ఇంటి కుక్క నే కదా! అని కుక్కను కరిచాడు.
కుక్క కూడా వెంగళప్ప ను ఐదారు జాగల లో కరిచింది. వెంగళప్ప కు దవాఖాన లో జైను కాక తప్పలేదు.
రామకృష్ణుడు వెళ్లి-ఇలా ఎందుకు చేశావు రా... అని అడుగగా-
నీవు చెప్పింది చేశాను రా అన్నాడు. ఓరి వెర్రి వెంగళప్ప అది వార్త అవుతుంది అనేది సామెత. నిన్ను కరవమన్ననా... అనేసరికి వెంగళప్ప ముఖం చాట అంతా అయింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి