మానవత్వం : యాడవరం సహస్ర గౌడ్-5వ తరగతి-ఆరెంజ్ గ్రామర్ పాఠశాలసిద్దిపేట9441762105

 రంగాపూర్  ఊరిలో ఉమ, రమలు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒక రోజు ఈ ఇద్దరు స్నేహితులు  పాఠశాలకు వెళుతుండగా, ఎండలు మండి పోవడంతో ఒక ముసలమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అందరూ చూస్తున్నా రు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అది చూసిన ఉమ, రమలు పరిగెత్తుకుంటు వచ్చారు.
  ఉమ తన బ్యాగ్ లో నుంచి నీళ్ల బాటిల్ తీసి ఆ ముసలమ్మ మొహం మీద చల్లింది. ఉమ, రమలు ఆ ముసలమ్మని ఒకచోట కూర్చోబెట్టారు. అందులో రమ తను తెచ్చుకున్న స్నాక్స్ బాక్స్ లో ఉన్న ఇడ్లీలు తీసి ముసలమ్మకు తినిపించింది. ఆ ముసలమ్మ ఆరోగ్యం కాస్త కుదుట పడింది.ఆ ముసలమ్మ మీరు ఎవరు బిడ్డ? మీ పేర్లేమిటి?  అని అడిగింది. తమ పేర్లు ఉమ,రమ అని ఇద్దరు స్నేహితులు చెప్పారు.
 ముసలమ్మ వయసులో చిన్నవారైన ఈ ఆలోచన ఎట్లా వచ్చింది బిడ్డ అని అడిగింది. అప్పుడు ఉమ, రమ లు మా స్కూల్లో టీచర్లు ఎల్లప్పుడూ ఆపదలో ఉన్నవారిని ,మానవత్వంతో మనకు తోచిన సహాయం చేయాలని చెప్పారని  ముసలమ్మకు వివరించారు. ఇంత మంచి మనసున్న ఉమ, రమ ను దగ్గరకు తీసుకొని ముద్దాడింది.
నీతి: వృద్ధులను, అసహాయుల ను ఆదుకోవాలి.

కామెంట్‌లు