సేవ"(బాలాగేయం):---చైతన్య భారతి పోతులహైదరాబాద్7013264464

ఎండలు మెండుగ మండేనo ట..
పచ్చని చెట్లు వాడేనంట..
మరువక నీళ్లు పోయాలంట..
పచ్చదనం నింపాలంట..

పక్షులకేమో ఆకలి దాహo అంట.. 
ప్రేమతో గింజలు నీళ్లు ఇవ్వాలంట..
పక్షిజాతిని మనం రక్షించాలంట..
పర్యావరణం అందరు కాపాడలంట..

ఆవు మేకా అయ్యో ఆకలిమంట..
పూట పూటకు మేతను వేయాలంట..
మూగజీవుల దాహార్తిని తీర్చాలంట ..
అవి మనకెంతో మేలే చేస్తాయంట..

మండుటెండలో మనుషులెందరికో ఆకలి మంట..
ఉన్నదాంట్లో అంబలి మెతుకులు పెట్టాలంటా..
మానవత్వం అందరుకుడా చాటాలంటా.. 
పరుల సేవయే పరమ తత్వము ఆంట..