పద్యాలు :--బెజుగాం శ్రీజ-ట్రిపుల్ ఐటీ బాసర-ద్వితీయ సంవత్సరం-గుఱ్ఱాలగొంది సిద్ధిపేట జిల్లా-చరవాణి:8897875575
1ఆ.వె.
 శ్రద్ధతోడమనము చక్కగా నాట్యాన్ని 
నేర్చు కొనగ వలెను నేర్పుతోడ
చక్కగానుజేయ జనములో మనపేరు
మారుమ్రోగుచుండు జోరుగాను
 2.ఆ.వె.
నాట్యకళనుమనము నమ్మకముగజేయ
ప్రజలు మెచ్చుకొనగ ప్రజ్ఞ పెరుగు
కష్ట మెంతయున్న ఇష్టంగ నేర్చిన
ఫలిత ములను పొందు భవితలోన.



కామెంట్‌లు