నాదేశంలో... నాభూమి:-మణిపూసలు:-గాజులనరసింహ-నాగటూరు 9177071129 కర్నూలు.
పాడియావు నాభూమి
బంగారం నాభూమి
సకల సంపదలా కొలు
వుగా..ఇదీ ..నాభూమి. 


నెత్తుటేరులే ఎన్నో
పొంగిపారిన నదులెన్నొ 
ఈ భూమిలో అంతరిం
చిపోయినచరితలెన్నో  

ధన్యభూమిలె  నాది
పుణ్యభూమిలె నాది
ఎంతో చరిత గలిగి
న కరుణ భూమి నాది  

కమ్మని జలపాతాలది
ఇది చక్కని సొగస్సులది
ప్రపంచంలొ విస్తరణలొ
ఎంతో విశాలమైనది  

ఆరు రుచుల అవని  గడ్డ
తెలుసుకోర తెలుగు బిడ్డ
అన్ని కలబోసుకున్నా
కళాతీతమైన గడ్డ  

పసిడి పాన్పుల భూమి
వెండి విరులా భూమి
వినెద ఎవరు చెప్పిన
వివేకము గలభూమి 

పౌరుషాల వీర గడ్డ
సువిశాల సుందర గడ్డ
అందరికి అన్నం పెట్టు
అన్నదాత యిభూగడ్డ  

తెలంగాణ పోరు గడ్డ
తేట తెలుగు మేటి గడ్డ
దోపిడి దారులనెందరి
నో చండాడిినా...గడ్డ 

స్వచ్చాందాల గడ్డ
సుగుణ సుందర గడ్డ
చూసుకోర మంచిగ
నిండు గర్భిణి గడ్డ  

తేనెలొలుకు తీపిముద్ద
కృష్ణుడె తిన్నదీ ముద్ద
అండపిండ బ్రహ్మా0డ
ములలోన ఒకటీ ముద్ద  

శ్రామికుల జీవీగడ్డ
ధర్మ దేవత యీ గడ్డ
సత్యమునే పలికినా.. హ
రిచంద్రుని సత్యపు గడ్డ  

సంజీవి మొక్కల భూమి
సుసంప్రదాయపూ భూమి
ఖండఖ0డాలలొ అచ్చ
తెలుగు గడ్డలె యీ భూమి 

స్వచ్ఛపు భూమి నాభూమి
పేరెన్నికైనది భూమి
ఎందరొ మహానుభావుల
స్వప్నాల పంట యిభూమి  

సస్యశ్యామలముగా
సుప్రవర్తతనముగా
కొనియాడుతూ ఉందిలె 
యిభూమి తరతరాలుగ  

కళలు వెలసిన భూమి
కథలు నడిచిన భూమి
పరిమళించు పూదో
ట ఇలలో ఈ భూమి  

రాయలు ఏలినా  భూమి
సప్తనది సంగమ భూమి
నాడు రత్నాల రాశులు
పొదిగిన భూమి ఈ భూమి 

విప్లవం పూసిన భూమి
రాముడు నడిచినా భూమి
అరె నరమేధాలెన్నో..
నాడును జరిగినా భూమి 

హరితవర్ణాలా  భూమి
జీవధాత్రిదీ..భూమి
నెహ్రూ మనజాతి రత
నమై  వెలిగినా భూమి 

గీతా0

మృతము  పంచినది
ఇది తుంగమ్మ తూలినది
సహజీవన సమతా భా
వనల సమతా వాదమిది  

కృష్ణమ్మ కులికిన భూమి
గోదారి ఉరికిన భూమి
తెలుగాంద్రా...అన్నదమ్ము
ల  ఆత్మీయతలా  భూమి 

కామెంట్‌లు