పాట:- గాజులనరసింహ -నాగటూరు గ్రామంకర్నూలు జిల్లా9177071129

పల్లవి:-

నా స్వతంత్రదేశంలో ఈ సుమసుందర లోకంలో....2

కరోనా కాలంలో దిన దిన గండంతో
కరెన్సీ భారంతో కరోనా కట్టడితో
విలపించే హృదయాలెన్నో..అలమటిించు జీవులుయెన్నో...
కనిపించక నేలరాలు తారలుయెన్నో...""పల్లవి""

చరణం:-1

అర్థంలేని జనులందరో యెడబాసిన క్షణాలతో..
మందులేని రోగాలతో..ఓపగలేని వేదనతో..
తల్లడిల్లు జీవులుయెన్నో..తలమునకలుగా
చీకటి మబ్బుల మునిగిపోయిన బతుకులు యెన్నో
యెన్నో.. ఇంకెన్నో...

ఆకలి దప్పుల దాహాలతొ గమ్యం ఎరుగని తీరాలలో..
అలసి ఆగిన జీవులుఎన్నో  రెక్క ఆడితే డొక్కాడని బతుకులుఎన్నో ...
యెన్నో... ఇంకెన్నో....."పల్లవి""

చరణం:-2

అధికారుల ధనదాహంలో..దుర్మార్గులు వ్యూహంలో 
రాజకీయపు కుట్రలలో  నలుగుతున్న నరులెందరో..
ఈ దుస్థితినిగని దయతలుచు వారెందరో..
ఎందరో వారెందరో ఏమూలనో  వారెందరో.. 

మమతల లేని వారే అంత 
సమతలు లేక సడలినవారే అంతా..
బహుబంధాల ఒడిలో  ఈ జీవన బడిలో..
విలువలు మరచిన మనుషులే అంతా..
అడుగడుగు  బలౌతున్న అభాగ్యులు ఎందరో ...
ఎందరో ఇంకెందరో..ఇలా.2 ""పల్లవి""



కామెంట్‌లు