ఆటాడుకుందాం వస్తారా....!( బాల గేయం )-డా, గాజులనరసింహ-నాగటూరుకర్నూలు జిల్లా9177071129
ఆటాడుకుందాం...!
వస్తారా వస్తారా...!
మీరు నేను కలిసి 
ఆడుకుందాం వస్తారా
హెహ్హేహ్హే హే....హే..
ఒహోఒహ్హోహ్హో... హో..2""ఆటాడుకుందాం"" 

యేటి ఒడ్డు కెళ్లి
గూళ్ళు కట్టుకుందాం
చింత చెట్లు ఎక్కి
చిగురులు కోసుకొందాం
చింతలేని  బతుకే 
మనది ఆడుకొందాం 

కరోనా రోగమొచ్చి
బడ్లకు సెలవు తెచ్చింది
పచ్చిక బయలు మనకే 
ఆహ్వానం పలికింది
ఆనందం మనదంటా
అవకాశం దొరికిందంటా  
 ""ఆటాడుకొందాం""

చెరువులకెళ్లి మనము
ఈతలు గొడతాము
చెల్లబట్టలు వేసి
చేపలు పడదాము
వస్తారా అన్నీ విద్యలు
మనము నేర్చుకొందాము  

పరుగెత్తి పరుగెత్తి
చాటున దాగుదాము
దొంగ పోలీసాటలే
మనము ఆడుకొందాము
ఆటపాటలే ఆరోగ్యం మనకు
తెలుసుకో ఓ నేస్తం   ""ఆటాడుకుందాం""

అరె చింతకాయలే
మనము కొడదామూ
అరె బుర్రుపిట్టలే 
మనము పడదామూ..
తుర్రుమంటూ తూలి ఎగిరే
తూనీగాలే పడదాము. 

ఏ0  నేస్తం చెప్పు  ఏ
ఆటలాడుదాం  చెప్పు
ఆటలాడకవుంటే
ఆరోగ్యానికే ముప్పు
ఏమిరా భాయ్! చెప్పు
గమ్మునవుంటే తప్పు  

పుట్టచేండుతో మనం
వీపుచెండు ఆడుదాం
రాయిబిల్లలు బేర్చి
లవ్ గోరి ఆడదాం
ఆడుతు పాడుతు ఉంటే
ఆరోగ్యమే మనవె0టే 

కోతీకొమ్మచ్చులు
అష్టాచెమ్మచ్చులు
మనకు ఇష్టమొచ్చినా..
ఎన్నెన్నో ఆటలు
ఆడుకోవచ్చు సరదాగా మీరు
నాతో వస్తారా వస్తారా .

పేదరాసి పెద్దమ్మ 
చందమామలొ ఉందంట
ఎన్నెన్ని  కథలో
ఆమెకు తెలుసంట
వస్తారా నేస్తం మీరు
నాతో వస్తారా .

నింగికి నిచ్చెన వేద్దాం
రెక్కలు కట్టుకొందాం
అరెవో ....రివ్వున మనము
నింగికి ఎగిరేద్దాం
విషయాలెన్నోతెలుసుకొందాం
ఈ విశ్వభారతిలో... 

వస్తారా వస్తారా
మీరు నాతో వస్తారా
ఎన్నో వింతలు మీరు
నాతో చేస్తారా..!
అవని అవధులు దాటేదాం
ఆ నింగిటంచులే తాకేదాం 

అల్లరి అల్లరి పనులే
ఇప్పుడిప్పుడే మనం
చేద్దాం..!ఎవరేమి అనుకోని
డోంట్ కేరందాం 
పదరపదరా...పదరపదరా
రారా రారా రారా రారా. "ఆటాడుకుందాం""