*జాతిరత్నము*:-డా. గాజులనరసింహ-నాగటూరు గ్రామంకర్నూలు జిల్లా9177071129

 చలాకి తనముల చిరునగువలవాడు
రవికిరణముల తేజము గలవాడు
అందరి మనసుల నిలిచిన వాడు 
అదిగో అదిగో చాచా నెహ్రూ  
అతడే పిల్లల నేస్తం జాతి వెలుగు కిరణం 
స్వతంత్రయోధుడు  కరుణానిధుడు
శాంతికపోతుడు  వినతుడు
సుగుణ పుత్రుడు సుందరుడు 
ఈ సువిశాలదేశాన్ని  ఏలిన చక్రవర్తుడు 
మానవతావాదుడు మహా మనుషుడు 
అతడే పిల్లల నేస్తం జాతికి వెలుగు కిరణం
చాచా నెహ్రూ... మన చాచా నెహ్రూ..

కామెంట్‌లు