దేవుడెపుడు భయపెట్టడు
జీవిత కష్టానికి తగు సేతువు నిచ్చున్
జీవుడు తప్పులు జేయుచు
దేవుడు భయపెట్టు ననుట దేనికి మనసా!
కం
తప్పక తెలియక చేసిన
ముప్పులు మన మదికి తెలిసి బుధులౌదురుగా
తప్పును సరిదిద్దు కొనుట
నొప్పును భగవంతుడెపుడు నుర్విన మనసా!
కం
నిర్భీతికి సాక్షి మనసు
దుర్భర పని భయము కొల్పి తుదకా మనిషిన్
దర్భకు దీటుగ మార్చును
గర్భగుడిన దేవుడైన కరుణించడుగా!
కం
సమతను మెచ్చును దేవుడు
మమతను చూపించు వారి మార్గం బందున్
సమముగ నిలబడి దైవము
గమనించును తప్పకుండ గనుమో మనసా!
కం
ఇచ్చునదేముందడుగగ
వచ్చును పుణ్యమె ఫలముగ వదులుము చెడునే
నిచ్చెడి వాడీశ్వరుడని
కచ్చితముగ నడుగనేని కాదను మనసా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి