చిత్రానికి పద్యాలు:-మమత ఐలహైదరాబాద్9247593432

 ఆ.వె
అలకలందు బాలలందాల భంగిమ
చూడ ముచ్చటైన సొంపులమరు
మోము దిప్పుకొనుచు ముఖము చాటునబెట్టి
వీపు చూపనెంత వింత యగును
కం
బాలలలక భంగిమలో
చాలా గమ్మత్తు దాగు; సాధించుటలో
గోలకు సమముగ ముఖమును
మూలకు దాచుంచుటెంత ముద్దు గొలుపునో 

కామెంట్‌లు