పద్యాలు:-మమత ఐలహైదరాబాద్9247593432

 ఆ.వె
తనదుమదికిహాని తలపెట్టజూసిన
తప్పువొప్పునిడిచి తగువుకొచ్చు
ముందటడుగుబట్టె గందరగోళంబు
మనసుపెట్టి వినుము మమతమాట
ఆ.వె
పాలమదిని విరిచి పరవశించెడివారు 
వేలు బెట్టి చూప వింత యగునె
తప్పులంతటుండు తగవులాపుటె విందు
మనసుపెట్టి వినుము మమతమాట
ఆ.వె
ముప్పుదెచ్చిపెట్టి మోదమొందెడివారు
హక్కు గోరుటెట్లు నన్యులందు
బాటతోడనుండు వేటయెప్పుడుగాని
మనసుపెట్టి వినుము మమతమాట
ఆ.వె
వింత సాహసాలు కొంత మానినగాని
మానవత్వవిలువ మరచిపోరు
కఠినరాయికింద కలదు చల్లనినీరు
మనసుపెట్టి వినుము మమతమాట