చిత్రానికి పద్యాలు:-మమత ఐలహైదరాబాద్9247593432

 కం
సోపాన పఠమునందున్
చూపబడెను పాములెన్నొ సుకుమారముగన్
యీ పఠ విన్యాసములో
ఆపదలడుగడుగునుండు ననుటను గనుమా!
కం
నచ్చును కైలాస పఠము
నిచ్చెన లెన్నున్నగాని నెదురుగ పాముల్
మచ్చిక దొరకని రీతిగ
ముచ్చటగా మింగివేయ ముదముగ జూసున్