పద్యాలు--అంశం:--పుస్తకం--మమత ఐలహైదరాబాద్9247593432

 తే గీ
మంచి స్నేహము వల్లనే మనసు నిండు
మంచి పుస్తకమెపుడును మనకు గురువు
మేలిమాలోచనలతోడ మెప్పు దొరికి
మనిషి జీవితంసాఫల్య మౌనునిజము
ఆ.వె
మంచి మైత్రి తోడ మనసు తేలిక చెందు
మంచి పుస్తకములు మార్గమిడును
మనిషి జీవితమున మంచిదారినిచూపు
మనసు పెట్టి వినుము మమత మాట