ఆ.వె
అమ్మ ప్రేమనెంచ నమృతపు కలశమే
స్వచ్ఛమైన హృదిన నిచ్చలముగ
నాడుచుండును కద నపురూప మునబిడ్డ
మనసుపెట్టివినుము మమతమాట
ఆ.వె
కన్నతల్లి ప్రేమ వెన్నపూసకు సాటి
బ్రతుకుచుండు బిడ్డ భవితకొరకు
పిల్ల నవ్వుల ఝరి తల్లికానందము
మనసుపెట్టివినుము మమతమాట
ఆ.వె
చందమామవంటి చక్కని బిడ్డను
సుందరముగనెత్తి చూపుచుండె
ఆకసంబులోని అందాలమామను
తల్లి మనసు నెంచ తరముగాదు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి