పద్యాలు : -బెజుగాం శ్రీజ-ట్రిపుల్ ఐటీ బాసర-గుర్రాలగొంది జిల్లా సిద్ధిపేటచరవాణి:9391097371


 1.తే.గీ.
నీడకోసమై వెదకుచు నిక్కముగను
చెట్టు కొమ్మలు నరికేసి పెట్టె గొడుగు
ప్రాణవాయువుదొరకక ప్రజలునెంతొ
బ్రతుకుభారమయ్యేనని బాధపడిరి
2.తే.గీ.
చెట్లనన్నియు నరకగా చేటుకలిగి
మండు టెండలుకాయగ మంట  పుట్టె
చల్లగాలియెదొరకక జనులె యంత
దిగులుచెందుచుబ్రతికిరి దీనముగను