అమ్మమ్మ:-వరుకోలు మాధవి-గృహిణి, కవయిత్రిగట్లమల్యాల సిద్ధిపేట జిల్లాచరవాణి:9441782816

అమ్మమ్మ ఇచ్చును
బోలెడన్ని ముద్దులు
ఆకలౌతుందంటె
అరిసెలు చేసి ఇచ్చును

ఆటలాడుకుంటనంటె
బ్యాటు బాలు ఇచ్చును
జేబునిండపుట్నాలు
నింపినన్ను పంపును

చిన్నపాటి జ్వరము వస్తే 
తట్టుకోలేదును
ఇంటి నంత దవాఖాన 
చేసి గోలీలేసును 

రాత్రి నిద్ర పట్టకుంటే
కథలు చాలా చెప్పును
నిద్రించే వరకు నెన్నొ
జోల పాటలు పాడును

అమ్మమ్మ మాటలు 
అమృతంలా ఉండును 
అమ్మమ్మ

మనసు 
వెన్నకన్న మెత్తన

తాతయ్య కన్న నన్ను 
మిన్నగ చూసుకుంటుంది 
దాచి దాచి డబ్బులన్నీ 
చాటుగ నాకిచ్చిను
అందుకే అమ్మమ్మ 
అంటెమరీ ఇష్టము.

కామెంట్‌లు