కరోనాతో వద్దు హైరానా:--కయ్యూరు బాలసుబ్రమణ్యం 9441791239
పిల్లలు....బాలలు
కరచాలనం వద్దండి
నమస్కారమే ముద్దండి

బుడతలు..బుజ్జాయిలు
వీధి తిండి వద్దండి
అమ్మ వంట ముద్దండి

పిడుగులు...గిడుగులు
పారిశుద్ద్యం గమనించండి
పరిశుభ్రత పాటించండి

చిన్నారులు...చిట్టిగువ్వలు
విహారయాత్ర వద్దండి
ఇంటిపట్టున ఉండండి

అబ్బాయిలు..అమ్మాయిలూ
కరోనాకు భయపడకండి
హైరానా పడకండి

పెద్దలూ..వైద్యలూ
అవగాహన కల్పించండి
నివారణ కల్గిగించండి


కామెంట్‌లు