*అక్షర మాల గేయాలు* *'ఎ' అక్షర గేయం* *గేయం: ఎండలు బాబోయ్ ఎండలు*:- *వురిమళ్ల సునంద,ఖమ్మం* 9441815722

 ఎండలు బాబోయ్ ఎండలు
ఎండిపోయిన బావులు చెరువులు
ఎటుచూసినా నిప్పులా ఎండలు
ఎవరిని చూసినా నీడ కోసమని
ఎక్కడెక్కడికో తీసే పరుగులు
ఎదురుగా చెట్టు కనబడగానే
ఎగిరి గంతులతో చెంతకు చేరి
ఎంతో  హాయిగా సేదను తీరిరి
ఎవరి ఇళ్ళకు వారంతా వెళ్తూ
ఎండిన గింజలు తీసికుపోయిరి