బంజారా సంస్కృతి సాంప్రదాయం:--వ్యాసకర్త:-రాథోడ్ శ్రావణ్ -ఉట్నూర్ సాహితీ వేదిక పూర్వ అధ్యక్షులు ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా*-చరవాణి సం 9491467715


 బంజారాలు (లంబాడీలు) భౌగోళికంగా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ  ప్రాంతాలలో ఎజేన్సి, మైదాన ప్రాంతాలలో నివసిస్తున్నారు. అదే విధంగా విరు గ్రామాలలో పట్టణాలలో నివసించకుండ అడవిలో,కొండలలో, గుట్టలలో, సభ్యసమాజానికి దూరంగా ప్రకృతి ఒడిలో ప్రత్యేక తండాలను ఏర్పాటు చేసుకొని జీవిస్తారు.
బంజారాలు (లంబాడీ) స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని తండాలుగా ఏర్పడి వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకొని నీటి వనరులు చూసుకోని వర్షపు నీటిపైనే ఆధారపడి జొన్నలు పండించే వారు.నీటి సౌకర్యం కలిగిన భూముల్లో మొక్కజొన్నలు పండించే వారు.లంబాడీల  ముఖ్య ఆహారం రొట్టెలు,కారం, ఆకుకూరలు, 
*భాజి,బాటి,కాందార్ ఖోడి*
సంచార జీవన కాలంనుండి కాయగూరలు అందుబాటు లేని కాలంలో అటవి ప్రాంతాలలో మైదాన ప్రాంతాలలో విరివిగా లభించే ఆకుకూరలపై ఆధారపడేవారు. అందుకే లంబాడీల నిత్య జీవితంలో ,
*జొన్న రొట్టెలు,భాజి*
 ఆకుకూరలు ముఖ్య ఆహారమైంది.ఇదేవిధంగా లంబాడీలకు బయట సమాజంతో ఏర్పడిన సాన్నిహిత్యం వల్ల వరి, గోధుమలు, పప్పుధాన్యాలు మొదలుకొని వాణిజ్య పంటలైన పత్తి ,పొగాకు, మొదలైన ఆహారపు వాణిజ్యపంటలు వారి జీవన విధానంలోకి‌ ప్రవేశించాయి.
*లంబాడీలు,గోర్ బోలి*  అనే ప్రత్యేకమైన భాషను మాట్లాడతారు.విరిని 
*గోర్ మాటి*
అని కూడ అంటారు. గోర్ బోలి భాష మాట్లాడుతుంటే విన సొంపుగా ఉంటుంది. లంబాడీల పెండ్లిళ్ళు, పేరంటాలు, విందులు ప్రత్యేకతను కల్గి ఉంటాయి. పెళ్లి కొచ్చిన యువతి యువకులు పెళ్లి చెయాలని పెద్దలు నిశ్చయించుకుంటే బందువుల ద్వారా, లంబాడీల పూరోహితులు గాన  గంధర్వులు ఢాడి, భాట్ ల ద్వారా, బాటసారులు, మిత్రులు ద్వారా వరుస అయ్యే యువతి యువకుల వివరాలు తెలుసుకుంటు చర్చించుకుంటారు.ముఖ్యమైన  ఒక వరుసైన కుటుంబంలో యువకుడు ఉన్నాడని తెలిస్తే అమ్మాయికి సంబంధించిన కుటుంబ సభ్యులుగాని , గాని,ఢాడి,భాట్ గాని వచ్చి కుటుంబ సభ్యుల వివరాలు ఆస్తి పాస్తులు గోసంపద మొదలగు వివరాలను అడిగి తెలుసుకొని తమవారికి చేరవేస్తారు. అన్ని విధాలా చర్చించుకొని ఇరువురికి సమ్మతమైనపుడు అమ్మాయి ఇంటి వద్దకు కాబోయే వియ్యంకుల
*సమ్ ది,సగాసేణ్,*
 కుటుంబ సభ్యులు బంధువులు, పెద్దలు, ఇరువైపుల వారు కూర్చోని ఇచ్చి పుచ్చుకునే విషయాలను కుల పెద్దలు 
*నాయక్,కార్భారి,డావ్*
 పంచుల మద్య
చర్చించుకొని ఇరువురు అంగీకారానికి వచ్చిన శుభ సందర్బంగా తీపికి సంబంధించిన చాయితాగి నోటిని తీపి చేసుకొంటారు.దీనినే 
*సగాయి* 
 అంటారు. సగాయి చేసేటప్పుడు గాని , 
*గోళ్* తినేటప్పుడు అందరూ క్షేమంగానే ఉన్నారా ? అని అడిగేటప్పడు ఈ విధంగా క్షేమసమాచారం అడుగుతారు.
*పంచ్ పంచాయత్ రాజా,రాజాభోజ్ రాజేరి సభ సగళ్ కచెరి పచారెలాక్, పచారే సవాలాక్,‌ హియాతి హియా  గోత్ ములాఖాత్, గోత్ గంగా గంగారోజళ్‌ కాశిర్‌తిరత్,బాయిర్ సఘా భాయిసణ్,ఆపణ్ సే‌ కసళ్ ఛ..! ఆపణ్,సేఆణంద్,...ఛ..!*
 ఆనాటి నుండి ఆ రెండు కుటుంబాల మధ్య "వియ్యం"  కుదిరినట్లు భావిస్తారు.అటు తరువాత ఎండాకాలంలో పెళ్లితంతు కార్యక్రమాలు ప్రారంభమౌతాయి. 
లంబాడీ సంస్కృతి సంప్రదాయాల్లో ఆదివారం, మంగళవారం పవిత్రమైన దినాలుగా భావిస్తారు.
 మొదట పెళ్లి కుమారుని
*వెత్ డు*
ఇంట్లో "
*సాడి*
ఆ రోజు దేమా గురు పెరిట "దాగ్ " ఇచ్చేటప్పుడు ఈ విధంగా పాట పాడుతారు
*కోళిఅవకోళిజావ కోళిమాయిజ్యోత్ సమావ*
*ధోళోఘోడోహస్లోపాతళియా సవార్, ముంగ్గెఆవడామోగరా, తల్లిఅవడాడేర్, మాయిజ్ పూజ మాయిజ్ పాతి మాయిజ్, హింగణ్ హర్ కోతళికటార్,లాగితలవార్, స్వామి అయ్యె స్వామి ఘోడోగురుబా,సదా..! సదా..!,* 
అనిపాడుతారు.పెళ్లి కొడుకుకు, మరియు అతని తమ్మునికి సూదితో చూరుక
*దాగ్*
 వెస్తారు కుడుక,  బెల్లం పానకంతో 
*ఘోటా*
అనే శుభకార్యం చేసి   ప్రజలందరు ఆరగిస్తారు.అ తరువాత రోజు 
*టేళో* (విందుభోజనం) చెసి మరుసటి రోజు బాజా బజంత్రిలతో అమ్మాయి ఇంటికి పెళ్లికి బయలు దేరుతారు పెళ్లి అమ్మాయి
*నవలేరి*
 ఇంట్లోనె చేస్తారు దీనిని పెళ్లి
*వాయా*
అంటారు. తరువాత సాయింత్రం పెళ్లి ‌కూతురును అత్తారింటికి సాగనంపడానికి ముస్తాబు చేసి పెళ్లి కూతురును నిలబెట్టి ఇంటి నుండి బయటకు తీసి " 
*హావేలియో...!*...
*హావేలి....! వడలాసు వదెసయే ఘూరలాసు ఫేలెసయో హావేలి...!*
అని పాట పాడి  ఆరుబయట తిస్తారు.అ తరువాత అత్తా తన అల్లుడి మేడ పట్టి ఏడుస్తూ ఢావ్లో చేస్తూ తన కుతురును ఎటువంటి కష్టాలు వచ్చినా గట్టు ఎక్కించాలని చెపుతు 
అదె రోజు తెల్లవారే లోపు పెళ్లి కూతురును అత్తవారింటికి పంపిస్తారు.ఇలా పెళ్లి తంతు కార్యక్రమము ముగుస్తుంది.
లంబాడీ జీవనంలో నృత్యం ఆట పాటలు ఒక భాగం . లంబాడీ స్త్రీలు దాదాపు తొమ్మిది,పది పద్దతుల్లో డప్పు దరువుకు‌ అనుగుణంగా నృత్యాలు చేస్తారు.లంబాడీల్లో 
*డప్పు లంబాడీలు ( ఢాలియా)*
 అనే ఉపజాతి వారు డప్పు వాయిస్తారు. పెళ్లి ,చావు, సందర్భాలలో కార్య పద్ధతులకు అనుగుణంగా డప్పు వాయిస్తారు. "డప్పు లంబాడీలు " కాళ్ళకు గజ్జెలు కట్టుకొని డప్పు కొట్టుకుంటూ చేసే నాట్యం శ్రోతలను, ప్రేక్షకులను రంజింపచేసి ఆకట్టుకుంటారు.
లంబాడీలు విందు, వినోదాలు, పెండ్లి,చావు, పుట్టుక, శుభ కార్యక్రమాలలో బ్రాహ్మణుల వేద మంత్రాలు ముందురోజులలో‌ లేకపోయినా ఈ రోజులలో తప్పని సరి అయినాయి.
లంబాడీ కుటుంబంలో ఎవరైనా  మరణిస్తే మూడవ రోజు  దినాలు చేస్తారు దీనినే  
*దాడో*
అంటారు.ఆదివారం రోజు మరణిస్తే ఆదే‌‌ రోజు దినాలు చేయాల్సి ఉంటుంది.ఇది ఆచారం దశత్రియ దినకర్మ చేస్తారు దీనిని "
*తేరవి* పెద్ద కర్మ
 అంటారు,"తేరవి"జరిగేవరకు తాండా ప్రజలు, మిత్రులు బంధువులే ఓదార్చి భోజనం ఏర్పాటు చేయడం ఎవరైనా క‌ష్టకాలంలో ఉంటే వారి కష్టసుఖాలో పాలు పంచుకొనే గొప్ప సంస్కృతి బంజారాల సంస్కృతి.
లంబాడీ జాతీలో ఏ కారణం చేతనైనా కుటుంబంలో అన్న మరణిస్తే కుటుంబ సభ్యులు, బంధువులు, పెద్దలు, శ్రేయోభిలాషులు చేరి విధవరాలైన స్త్రీకి  పక్షపాతం తో  ఆలోచించి అన్నాకు పుట్టిన  సంతానం తమ్ముడైతేనే బాధ్యతగ చూసుకుంటాడని వారిని తన సంతానంగా భావించి విధవరాలును సమాజంలో  నీచంగా చూస్తారని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం.
లంబాడీ సంస్కృతిలో 
ముఖ్యమైన పండుగలలో "
*తీజ్,సీత్లా, బాలాజీ (భోగ్,భండారో)దస్ రావ్,దవాళి,మత్రాల్(గౌమాతాపూజ) హోళీ,పాడ్వా,(అట్మో)* ముఖ్యమైనవి. వర్షాలు కురవకపోవడంతో విరు వానదేవులకు వర్షాలు కురువాలని అమ్మాయిలు
*భత్ కోలా*  అబ్బాయిలు 
*మిటక్,మాటక్* చెసి వాన దేవతలకు నైవేద్యం చేసి సమర్పిస్తారు.
తీజ్, సీత్లా,ముఖ్యపండుగ వర్షాలు  కురువంగానే పంట చేను దున్ని విత్తనాలు వేసిన తరువాత లభించిన ఖాళీ సమయాల్లో జూలై, ఆగష్టు మాంసలో తాండా పరిసర ప్రాంతంలో  
సీత్లా,హింగ్ ళ్ళా, తళ్జా,మరియామా, జగదాంబ,కంకాళి,భవాని, మొదలగు ఏడు  మాతృదేవతలకు  మేకపోతు
*బకరా*
 జంతుబలి ఇచ్చి పట్టిన రక్తంలో  నవ‌ధాన్యాలతో వండిన గుడాలను తాండాలలో ప్రతి ఇంటి నుండి సేకరించి రక్తంలో కలిపి దేవతలకు సమర్పించి జబ్బుల నుండి కాపాడాలని, ఆరోగ్యంగా ఉంచాలని పంటలు బాగా పండాలని, పిల్ల పాపల్ని చల్లగా చుడాలని , వర్షాలు కురువాలని కొలుస్త రక్తపు గుడాలు చల్లుతారు.
 
అదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఎండాకాలంలో 
*దస్ రావ్* పండుగను
ఎక్కువగా చేస్తారు.ఏడు దేవతలు,భవాని,మరియామా, తళ్జా,కంకాళికి మేకపోతును   బలిచ్చి  మాంసంతో తయారు చేసిన 
*సళోయి,నారెజా,  భోటి, మరియు బాటి* తిని
కుటుంబ సభ్యులు, బంధువులు, పెద్దలు ఇత్తడి లేదా కంచు పల్లెము,నగారా
*థాళి,నంగారా* మోగిస్తూ రాత్రి మొత్తం నిద్దురపోకుండా భవానిని కోలుస్తు ఈ పాటాలు 
*అత్‌రాదనేరి భవాని కత గయితి  తోన కుణ వలేమాయో* అని పాడి ప్రోదున్న *దేవిమదేవికుణ్సి మోటి వియోరె కోళేతారా* హరతితో సమాప్తం చేసి భోజనం చేసి ముగిస్తారు.
*తీజ్* గోర్ బంజారాలు తీజ్ పండుగను శ్రావణ మాసంలోని రాఖీ పూర్ణిమ రోజున ‌ప్రారంభించి,  శ్రీకృష్ణఅష్టమిన సమాప్తం చేస్తారు. దేశమంతటా ఘనంగా తోమ్మిది రోజులు జరుపుతారు.తీజ్ (ప్రకృతి పండుగ)
 పవిత్రమైన పండుగ తండాలోని ఆడపడుచు పెండ్లికాని అమ్మాయిలు అనుమతి కోసం *తండా నాయిక్* ఇంటికి వెళ్ళి అనుమతి తిసుకొని అంగడి నుండి వెదురు బుట్టలు 
*ఓల్డి*‌ తెచ్చి అడవికి వెళ్ళి చీమపుట్ట
*(మకోడార్,ధూడ్)*
మట్టిని సేకరించి నానబెట్టినా  గోధుమలను ఊరిలోని స్త్రీలందరు నాయకుని ఇంటికి వెళ్ళి  బుట్టలలో గోధుమలు,మట్టి చల్లుతారు వాటిని తండా నాయికుడి‌ ఇంటి ముందు ఏర్పాటు చేసిన మంచె పై బుట్టలు పెట్టి యువతులందరు  రోజు రెండు సార్లు నీరు పోస్తు సేవాభాయా, మేరామయాడిని పొగుడుకుంటు ఈ పాట‌ పాడుతారు.
*సేవాభాయా బోరాయోతీజ్ ఘడిఎక రమలెతి*
*మారిహూసె లాడెరియే తీజ్ ఘడిఎక రమలెతి*
ఇలా ఎనిమిది రోజులు భక్తి శ్రద్ధలతో నీరు పోసి ఆరోజు మట్టితో ఆడ,మగ‌ రెండు మట్టి బొమ్మలు 
*డొక్రి,డొక్రా*  
*(గణ్,గోర్)* 
తయారు చేసి
వాటిని పూజ చేసి పెండ్లికానీ యువతులకు మంచి భర్త, సంబంధాలు రావాలని కోరుతారు దీనిని
*ఢంబోళి* అంటారు.
 తోమ్మిదవ రోజున పూజ చేసి సేవాలాల్  మేరమమాతాకు నైవేద్యం సమర్పిస్తారు.తరువాత తండా లోని, నాయక్,కారోభారి, స్త్రీ పురుషులు, యువకులందరు గుంపుగా 
*మళావ్* కూర్చొంటే యువతులు తమతమ బుట్టల నుండి తీజ్ తెంపి వరుసగా గుండ్రంగా తిరుగుతూ పాటలు పాడుతూ తీజ్ ను వారివారి,
*తలపాగా (పాగడి),జేబు,ఖీసో, చేతులలో ఇచ్చి ఇలా పవిత్రంగా పచ్చగా ఉండాలని జీవించాలని కోరుతారు. యువతులు, యువకులు, పెద్దలు,అందరు డప్పు చప్పుళ్లతో నృత్యాలతో పాటలు పాడుతూ ఆడుతూ తీజ్ ను నిమజ్జనానికి నీళ్ళున్న చోటుకు చేరువుకు గాని,నదితీర ప్రాంతానకి గాని చేరుకొని నీటిలో దిగి తమ తమ చేతుల్లో ఉన్న తీజ్ బుట్టలను నీటిలో వదిలి అమ్మాయిల కాళ్ళను వారి వారి తోబుట్టువులు కాళ్ళు కడగుతారు.తమకు వరుసైన యువకులను బనాయిస్తూ  తమ తమ ఇండ్లలకు చేరుకోవడంతో తీజ్ పండుగ ముగుస్తుంది.
 లంబాడీల జీవనంలో 
*గావ్ డి*
గోవును పూజిస్తారు. సంచార జీవనంలో తమ యొక్క వస్తువులను చేరవేయడానికి ‌గోవు ఉపయోగపడ్డది. ఉప్పు వ్వాపారం చేసినపుడు, సంచారంలో గోవులు ఉపయోగపడ్డాయి.సంచార జీవనం నుండి ‌స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకొని జీవించే క్రమంలో, నాగలి " 
*నాగర్*
దున్నడానికి, బండి "
*గాడి*
 లాగడానికి, పశువులు ఉపయోగపడ్డాయి.చివరికి గోవు మూత్రమును కూడ ఇండ్లలో, వాకిట్లో, చల్లుతారు.గోవు మూత్రం వల్ల సూక్ష్మక్రిములు నశిస్తాయని విరి నమ్మకం.‌ ఆవు పేడ పంట పొలాలకు ఎరువుగా ఉపయోగిస్తారు.అందుకే గోవుతో ఉన్న అనుబంధం దృష్ట్యా గోవును పూజిస్తారు.
లంబాడీ సంస్కృతిలో  వివాహమైన స్త్రీలకు ఆద్దాల 
*కాచళి ,ఫేటియ్య, ఘూంగటో*
లేక 
*టుక్రి*
 కప్పుకుంటారు, పురుషులు,
*ఖమిష్,ధోతి,సేలా,పట్కా (పాగడి)*
, కట్టుకొని తలకు తలపాగ 
*పట్కా*
  చుట్టుకుంటారు.
లంబాడీ కుటుంబంలో కూతురు జన్మించిందంటే తమ ఇంట్లో లక్ష్మి వచ్చిందని గర్వించి వృద్ధాప్యంలో కొడుకులు బాగోగులు చూసుకొకున్నా బిడ్డలైన చూసుకుంటారనే ధైర్యం, ముఖ్యంగా ఇంటి పనిలో, వంటపనిలో, వ్యవసాయపనులలో  తల్లిదండ్రులకు సహాయకారిగా ఉంటారు.ఆమ్మాయిలకు చిన్న వయసు నుండే కాళ్ళకు పట్టిలు
*పింజణ్* *ఘూగ్రాలు*  గజ్జెలు కడతారు.ముక్కుకు 
*నతలి*,
*భూరియ్యా*
చెవులకు,
*రింగె*
(రింగులు) కాళ్ళగజ్జెల చప్పుడు విని విషపురుగులు పక్కకు పారిపోతాయి అని విరి విశ్వాసము.
కుటుంబంలోని పెద్ద, చిన్న కుమారుడికి పెండ్లి చేసేటప్పుడు తప్పక రెండు లేదా మూడు మేకపోతు కోసి *వదాయి* చేస్తారు.పెండ్లి సమయంలో చనిపోయిన పెద్ద లకు గుర్తుగా 
*చోకో*
పూరించి మేకపోతు కోసి
*వకాళీ,నారేజా*   చేసి మాంసం ఉడికించి ములగబోక్కలు ఏడు, కాలేయం ముక్కలు ఏడు
*ఘూండివాళో హడ్కా,కళజొ*
  సమర్పించి 
*ధప్కార్*
 అగ్నిహారం ఇస్తారు.
లంబాడీల ముఖ్యమైన దేవాలయాలో , మహా రాష్ట్రంలోని  వాసిమ్ జిల్లా లోని
*పౌరదేవి దేవాలయం* మరియు నాసిక్ జిల్లా లోని వట్టాంగ్ళి  క్షేత్రంలోని 
*సతిసామత్ దాదాదేవాలయం*
 తెలంగాణ రాష్ట్రలోని ఆదిలాబాద్ జిల్లాలోని కొత్తాపల్లి 
*దీక్షభూమి దేవాలయం*
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రలోని అనంతపుర్ జిల్లా గుత్తి బళ్ళారి  భీమానాయిక్ తాండా లోని
*సేవాఘడ్, దేవాలయం*
చిత్తూరు జిల్లా తిరుపతిలో గల *హతిరాం మహారాజ్* దేవాలయం
కర్నాటక రాష్ట్రంలోని
*కాళ్యాకుండక్షేత్రం*
  ముఖ్యమైన ఈ దేవాలయం దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి దాదాపు పది నుండి పదిహేను లక్షల వరకు భక్తులు వచ్చి  దర్శించుకోని కోరికలు తీర్చుకుంటారు. 
దేశమంతటా 15ఫిబ్రవరి 1739 వ సంవత్సరంలో బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవా లాల్ మహారాజ్ జన్మదినమున దేశ మంతటా ‌సేవాలాల్ జయంతిని ఘనంగా జరుపుకుంటారు.
మహారాష్ట్రలోని పౌరఘడ్ లో సేవాభాయా,మరియామా దేవతలను దేశంలోని గోర్ జాత్  వారు (లంబాడీలు,సుగాలీలు,లమానిలు, బంజారాలు, ) భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. భక్తులు స్త్రీ, పురుషులు 40 రోజులు దీక్ష  పట్టేటప్పుడు తెల్లని లుంగిలు గాని,ధోవతి గాని, ప్యాంటు గాని తొడిగి గులాబీ రంగు దుస్తులు ధరించి భక్తి శ్రద్ధలతో భజన, కీర్తనలు చెసి హరతిలు ఈ విధంగా
*సద్గురు హమారో పామణో రెయెవాళో,అజెరో దాడో సోనె సరికో మళో కరతాణీ వాసనా శుద్ద మనేరి ఓవాళు అరతి గురుప్రేమ్ సింగేరి* 
పాడుతారు.దీక్ష సమయంలో భక్తులు మాదకద్రవ్యాలు సేవించడం కానీ అబద్ధాలు మాట్లాడడంగాని, అపకారాలు తలపెట్టే విధంగా కుట్రలు చేయడం, దూషించడం,చెడు ఆలోచనలు పెట్టుకోవడం గాని చేయరు. భక్తులు స్వయంగా తయారు చేసిన వంటకాలు మాత్రమే భుజిస్తారు.అంటు ముట్టు ఐనా పానియాలు సేవించరు ఈ కార్యక్రమం శ్రీ రామనవమికి 40 రోజులు ముందు దీక్షలు చేపట్టి శ్రీ రామనవమి వరకు  పౌరాదేవికి  వేళ్ళి శ్రీరామ నవమి రోజున మాతకు భక్తులు కానుకలు సమర్పించి మొక్కు చెల్లించి సేవా లాల్ దీక్ష విరమిస్తారు.