విప్లవ నినాదం అమృతఘడియలు:-యడ్ల శ్రీనివాసరావు విజయనగరం చరవాణి :9493707592
కనులు మూస్తే చీకటి మయం
తిమిరము త్యజిస్తే వెలుగు మయం..!

చెప్పుడు మాటలు వినవద్దు
కనులు తెరిచి బ్రతికి ఉండు..!

ఉప్పు నీరు కన్నీరైతే దళం
మంచినీరు నిశ్శబ్దం తెగించిన గళం..!

కీర్తి మరణాంతరం నిలుచును
మనిషికి విలువ వెలుగు తెన్నులు గలదు..!

అమరమైన జ్ఞానం
బానిసత్వం బంధించిన వైనం..!

దివిటీలతో చేసిన రణం
విప్లవ నినాదాలు విజయం..!

పోరాడితే ప్రతిక్షణం సంకల్పం
పోరాట కనువిప్పు విప్లవ విజయ గమనం..!

సాధిస్తే అమృతఘడియలు కావచ్చు
పోరాడితే ఎండిన బ్రతుకులు చిగురించ వచ్చు...!!!

కామెంట్‌లు