కుర్చి గొప్పతనం:-బెజుగాం శ్రీజ-ట్రిపుల్ ఐటీ బాసర-ద్వితీయ సంవత్సరం-గుర్రాలగొంది సిద్ధిపేట జిల్లా-చరవాణి:9704865816


  1ఆ.వె.
కుర్చి మీద సారు కూర్చుని పాఠాలు 
చెప్పు చు౦డ మనకు గొప్ప గాను
శ్రద్ధ తోడ వినియు సాగాలి ముందుకు
శ్రీజ చెప్పు చుండు చిత్రముగను
2ఆ.వె.
రాజు కూరు చుండి రాజ్యాన్ని పాలించు
ప్రజల కష్ట ములను పారద్రోలు
ధర్మ మందు నిలిచి ధైర్యము కోల్పోక
పాల నెంతొ జేయు ప్రగతి కొరకు

కామెంట్‌లు