దీర్ఘాయుష్మాన్ భవ:-పిల్లి.హజరత్తయ్య-శింగరాయకొండప్రకాశం జిల్లా-9848606573
“ఆరోగ్యమే మహాభాగ్యము”
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి సుఖంగా ఉంటాడు సృష్టి ధర్మాన్ని సృష్టి నియమాన్ని పాటిస్తూ పరిపూర్ణ జీవన యాత్రను చేరుకోవాలి

ఆరోగ్య విలువ అనారోగ్యం లోనే తెలుస్తుంది ఆరోగ్యానికి మంచి అలవాట్లు కలిగి ఉండాలి

ప్రతి దినము వ్యాయామం, యోగా ,ధ్యానం లాంటివి వాటిని అనుసరిస్తూ వ్యాధినిరోధక శక్తిని పెంచుకొని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి

చెడు అలవాట్లుని విడిచిపెట్టి ప్రకృతిలోని పచ్చదనమును పరిరక్షిస్తూ పరిశుభ్రతే మనకు రక్షయని గుర్తెరిగి నడవాలి

పౌష్టికాహారం నిత్యం తీసుకుంటూ ప్రతిరోజు వేళకు భోంచేస్తూ ఆరోగ్యాన్ని, ఆయుష్షును పెంచుకోవాలి

సహజ సిద్ధమైన ఆహార పదార్ధాలను ఆరగిస్తూ 
నిరాడంబర జీవితాన్ని ఆస్వాదిస్తూ 
నియమనిబంధనల జీవనాన్ని సాగిస్తూ 
నిత్యం కష్టపడి పని చేస్తూ 
భారతీయ జీవనాన్ని ఆహ్వానిస్తూ 
'శతమానం భవతి', 'దీర్ఘాయుష్మాన్ భవ' అంటూ కలకాలం ఆరోగ్యంగా జీవిస్తూ ఆరోగ్య భారత్ నిర్మిద్దాం ఆయుష్మాన్ భారత్ ఆశయాలను సాధిద్దాం




కామెంట్‌లు