మూర్ఖులు:---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి. మొబైల్: 9908554525.

  రామయ్య దగ్గర వెంకటేశం పది వేల రూపాయల అప్పును తీసుకున్నాడు. రామయ్య ఎన్నిసార్లు అడిగినా " అడిగిన తెల్లవారి ఇస్తాను" అని అనడమే తప్ప ఇవ్వడంలేదు .చివరికి రామయ్య గ్రామాధికారికి ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి వెంకటేశాన్ని  పిలిపించి రామయ్య బాకీ సంగతి అడిగాడు." అడిగిన తెల్లవారి  ఇస్తాను "అన్నాడు వెంకటేశం .ఈ డొంకతిరుగుడు జవాబులు కట్టిపెట్టు. నీవు ఎన్నడూ అడిగినా ఆనాటి తెల్లవారి ఇస్తాననే అర్థం వస్తుందని అందరూ అంటున్నారని రామయ్య చెప్పాడు.  అందువల్ల మరొక వాయిదా పెట్టు" అని అన్నాడు గ్రామాధికారి .
       అప్పుడు వెంకటేశం ఫిబ్రవరి 30వ తేదీ నాడు ఇస్తానని అన్నాడు. రెండో వాయిదా పెట్టినందుకు గ్రామాధికారి సంబరపడ్డాడు. ఆ తర్వాత రామయ్య ఫిబ్రవరి నెలకు 28 లేదా 29వ తేదీలే  ఉంటాయనీ,30వ తేది ఉండదని తెలుసుకుని లబోదిబోమని తిరిగి గ్రామాధికారి దగ్గరకు వెళ్లి  ఈ సంగతిని చెప్పాడు. గ్రామాధికారి తిరిగి వెంకటేశాన్ని  ఆంగ్ల క్యాలెండర్ వద్దని, తెలుగు సంవత్సరాలది మరొక వాయిదా పెట్టమన్నాడు . అప్పుడు వెంకటేశం ఈ 60 సంవత్సరాలు కాకుండా 61వ సంవత్సరం  ఇస్తానని, దాని పేరు తనకు గుర్తుకు రావడం లేదని అన్నాడు. అదికూడా నిజమని నమ్మిన మూర్ఖుడైన గ్రామాధికారి సరేనన్నాడు .
        ఆ తర్వాత రామయ్య తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే అని తెలుసుకొని లబోదిబో మన్నాడు. గ్రామాధికారి కూడా తనలాగే తెలివి తక్కువ వాడు అని తెలుసుకున్న రామయ్య మళ్ళీ గ్రామాధికారి వద్దకు పోలేదు. వెంకటేశం అప్పు తీర్చనే లేదు.

కామెంట్‌లు