ఒక పట్టణంలో శంకర్రావు అనే అనే పెద్దమనిషి ఉండేవాడు. అతడు చాలా మేధావి. తాను ఇచ్చే సలహాలు అందరి సమస్యలను పరిష్కరిస్తాయని, ఒకవేళ అలా పరిష్కరించకుంటే తాను తీసుకునే ఒక వెయ్యి రూపాయల ఫీజుకు రెట్టింపు డబ్బు రెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు.
అప్పుడు అతని వద్దకు ఈశ్వరయ్య అనే ఆసామి వచ్చి" అయ్యా! ఈ పట్టణంలోనే మా బావ ఇల్లు ఉంది .అతని ఇంటి బయట కొంత స్థలాన్ని ప్రక్క ఇంటి వ్యక్తి అక్రమంగా ఆక్రమించాడు . అందుకు నేను ఏమి చేయాలి? మీరిచ్చే సలహా ఏమిటి?" అని ప్రశ్నించాడు.
అప్పుడు శంకర్రావు అతని వద్ద నుండి వెయ్యి రూపాయల ఫీజు తీసుకొని "ఏమీ లేదు. నేను న్యాయాధికారి దగ్గరకు వెళ్తాను" అని చెప్పండి.అతడు "అలా ఆక్రమించడం చాలా అన్యాయం "అని అన్నాడు. "అయితే మీరు కూడా ఇది అన్యాయం అని అంటున్నారా!"అని అన్నాడు . "అవును.ఇది ముమ్మాటికీ అన్యాయమే. ఎన్నిసార్లయినా నేను ఇదే మాట అంటాను "అని అక్కడున్న వారందరిముందు అన్నాడు. అప్పుడు ఈశ్వరయ్య "అయితే అలా ఆక్రమించినది మీరే "అని అన్నాడు. అప్పుడు శంకర్రావు నాలుక్కరుచుకుని వెంటనే రెండు వేల రూపాయలు ఈశ్వరయ్యకు చెల్లించాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి