ప్రపంచం ఇప్పుడు గబ్బిలంలా
తలకిందుకులుగా వేలాడుతుంది.
ఇంటి కిటికీ నుండి బయటికి చూస్తే ,
స్వేచ్ఛగా తిరుగుతున్న జంతుజాలం..
బండ్లు, ఓడలు అవుతాయంటే ఇదేనేమో..
ప్రకృతి తన ,కళ్ళను కమ్ముకున్న
పొగను తుడుచుకుంటుంది.
మసక బారిన ఆకాశం తెల్లని
మబ్బులతో స్నానం చేస్తుంది.
మానవుడు సాధించిన శాస్త్ర
సాంకేతిక పరిజ్ఞానం , నాలుగు
గోడల మధ్య చిక్కుకుంది.
పారిశ్రామిక కాలుష్యం ఊపిరిని చిదుముతుంది. , .
అహం నిండిన మనిషి ఆధిపత్య ధోరణితో
నెమలిని బందించి నాట్యం చేయించాడు.
జంతు గుహలను శోధించి తన నివాసంగా నిర్మించుకున్నాడు.
మృగాల కోరలు పీకేశాడు
విషపు క్రిమి కోరల్లో విలవిల లాడుతున్నాడు.
ధర నరాల్లో దాగిన చమురును
పిండిన వైనం
సంద్రం గుండెల్లో విష వాయువు నింపిన కథనం
సాటి జీవులని. ప్రేమించలేని
హృదయం రోదనలో వేసారుతుంది...
.ప్రాణి మనుగడను దూరం చేసిన
తప్పిదమేదో చుట్టుముట్టి
బ్రతుకు ఒంటరి అయ్యింది.
తను ఎక్కిన కొమ్మను తానే
నరుక్కున్న దుస్థితిలో,
దీన స్థితిలో మిగిలాడు
మృగాడి వేటకు జంకిన జింకలు అతని జాడలేదని
రహదారి మీద చెంగు చెంగున
గంతులేస్తున్నాయి.
.జూలో ఇన్నాళ్లు బంధించింది జంతువులనా,
,తననా అని మనిషి లెక్క
పెట్టుకుంటున్నాడు...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి