రామాపురంలో రాజయ్య అనే రైతు వుండేవాడు . అతని ఇంటి పక్కన వున్న పోలయ్య కూరగాయలు రాజయ్య వద్ద కొని బజారులో అమ్ముకుని జీవిస్తుండేవాడు . ఒకసారి రాజయ్య ఒక నెల రోజులు తన బంధువుల ఇంటికి వెళ్లవలసి వచ్చి పోలయ్యను పిలిచి సంగతి చెప్పి నా ఇంటి చుట్టూ వున్న పళ్ళు ,కూరగాయలూయీ , పూల చెట్లకు పెరటి బావి నుండి నీళ్ళుతోడి చెట్లకు పెట్టి కాపాడమని అడుగగా “ అలాగే !! ఇరుగు పొరుగు అన్నాక ఒకరికొకరు సహాయం చేసుకోవడం తప్పదు కదా ? అలాగే నీవు వచ్చే వరకు చెట్ల కు నీళ్ళు పెట్టి కాపాడే బాద్యత నాది“
అన్నాడు .
ఆ మాటతో రాజయ్య ఊపిరి పీల్చుకుని ఊరికి బయలు దేరాడు.
రోజు పోలయ్య ఒప్పుకున్నట్లు బావి లోని నీరు చేది చెట్లకు పోస్తూ ఒకరోజు ఇంటి కిటికి పక్కన వున్న పెద్ద మామిడి చెట్టుకు చెద పట్టి వుండడం గమనించి దానికి మందు కొట్టాలని నిర్ణయించుకుని దగ్గరకి వెళ్ళి చూడగా, ఆ పక్కగా వున్న కిటికీ కూడా చెద పట్టి రంధ్రాలు పడి బాగా దెబ్బతిని ఉండి పోవడానికి సిద్దంగా వుంది. పోలయ్య మనసులో “ అయ్యో రాజయ్య ఇది గమనించి నట్లులేదు. కిటికీ పాడైపోయింది“ అనుకుంటూ కిటికీలో నుండి లోపలికి తొంగి చూశాడు .
ఇంట్లోగోడకున్న పలక పై దేవుని పటం, దానిపక్కన ఒక తళ తళ మెరుస్తున్న నగిషీలు చెక్కిన పెద్ద ఇత్తడి చెంబు పోలయ్య కంట పడింది . దాన్ని చూసిన పోలయ్యకు ఆలోచనలో మార్పు వచ్చి దుర్భు ద్ది పుట్టి చెంబును అలాగైనా అపహరిస్తే అందులోని ధనం తో మెరుగై న వ్యాపారమేదైన చేసుకోవచ్చు , రాజయ్య నెలవరకు రాడు” అని తలచి మెల్లగా కిటికి తొలగించి లోపలకు వెళ్ళి చెంబు దొంగలించి తీసుకెళ్లిపోయాడు . రోజు ఎప్పటి లాగే చెట్లకు నీళ్ళు పోస్తూ నేవున్నాడు .
నెల గడి చే సరికి రాజయ్య రానే వచ్చాడు . చెట్లకు నీళ్ళు పోస్తున్న పోలయ్య తో “ పోలయ్య నా చెట్లకు నీళ్ళు పోసి కాపాడినoదులకు నేను నీ మేలు ఎన్నటికీ మరచి పోలేను.” అంటూ కృత జ్ఞతలు తెలిపాడు .
లోలోపల కంగారు , భయంతో వున్న పోలయ్య పైకి మేక పోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ “దానిదే ముంది ఇరుగు పొరుగు వాళ్ళం ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఎలా ? “ అన్నాడు నవ్వుతూ .
రాజయ్య రోజు పొలం పనికి పోయే ముందు దేవుడికి దండం పెట్టుకుని దీపాన్ని వెలిగించడం అలవాటు. రోజు లాగే దీపం వెలిగిస్తూ ఆ పక్కన వుండవలసిన నగిషీల ఇత్తడి చెoబు కనపడక పోవడం తో కంగారు పది ఇల్లంతా వెతికి చివరికి పోలయ్యను పిలిచి విషయం చెప్పి అడుగ గా, ఏమి తెలియనట్లు “ నాకేం తెలుసు రాజయ్య . నేను ఇంటి బైట చెట్లకు నీళ్ళు పోయమన్నావు. రోజు పోస్తున్నాను. ఇంటి లో చెంబు ఎలా పోయిందో నాకు మాత్రం ఎలా తెలుసు ? మామిడి చెట్టు దగ్గర కిటికీ కి చెద పట్టి అంతా రాలి పోయింది . అప్పటికి చెట్టుకి మందు కొట్టాను . కిటికీ లో నుండి ఏ దొంగ అయినా దూరి ఎత్తుకు పోయాడేమో ..” ’అన్నాడు . రాజయ్యకు పోలయ్యపై అనుమానం వచ్చి గ్రామాధి కారికి ఫిర్యాదు చేశాడు . ఇద్దరినీ గ్రామాధికారి పిలిచి విచారించి మొండిగా వాదిస్తున్న పోలయ్య ఇంటిని సోదా చేయించి చెంబును తెప్పించాడు .
భయం లోపల దాచుకున్న పోలయ్య గ్రామాధికారితో అప్పటికి “ఆ చెంబు మా తాతల కాలం నాటిది “ అని వాదించ సాగాడు . గ్ర్తామాధి కారి “ నీదేనన్న సాక్ష్యం , ఆధారం ఏమిటి అని గట్టి గా ప్రశ్నిచాడు. పోలయ్య జవాబు చెప్పలేక నీళ్ళు నమలడం, మొదలు పెట్టాడు . గ్రామాధికారి అదే ప్రశ్న రాజయ్యను అడుగగా తడుముకోకుండా “ ఆ నగిషీల ఇత్తడి చెంబు ను బాగా పరిశీలించoడి రామ నామం , ఓం కారం అనే అక్షరాలు చెక్క బడి వున్నాయి .” అనగానే
పరిశీలించిన గ్రామాధికారి, ” అదీ రాజాయ్యదే” అని తీర్పు చెప్పగా , పోలయ్య భయపడుతూ రెండు చేతులు జోడించి నమస్కరించి తప్పును ఒప్పుకున్నాడు . అందుకు గ్రామాధికారి రాజయ్యను “ పొలయ్యకు ఏ శిక్ష ను విధించoటావో నీవే చెప్పు” అని అడుగగా “ అయ్యా పోలయ్య నాకు తెలిసి నప్పటి నుండి చాలా మంచి వాడు . కానీ ఒక్క సారి మనిషి కి ధనం ,బంగారు లాంటి వి చూసి దుర్భు ద్ది పుడుతుంటాయి , తాను కష్టజీవి.. ఇలా చేస్తే తన
కష్టాలు తీరుతాయని చేసి ఉండవచ్చు . అతనికి చదువు రాదు అందుకే చెoబు పైన చెక్కిన అక్షరాలు గమనించ లేక పోయాడు. అందుకని ఇదే మొదటి తప్పుగా భావించి వదిలి వేయండి “ అని అడిగాడు . ” గ్రామాధి కారి :” చూశావా పోలయ్య .. నీ పొరుగు వాడు రాజయ్య ఇంట్లో నువ్వు దొంగలించినా నిన్ను శిక్షించవద్దని వేడుకున్నాడు . అదే మానవ త్వం అంటే. ఇక నైనా బుద్దిగా బతుకు “ అని ఇద్దరినీ పంపేశాడు .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి