పోలయ్య మేకలు , గొర్రెలు మేపుకుని జీవనం గడిపేవాడు . ఇంటివద్ద కాపలాగా వుంటుందని ఒక చిన్న కుక్క పిల్లను తెచ్చి జిత్తు అనిపేరు పెట్టి పెంచసాగాడు .
రోజు పోలయ్య గొర్రెల మందని ఊరిచివరిన వున్న పచ్చిక బైళ్ళ వద్దకు తీసుకెళ్ళేవాడు . రోజులు గడిచేకొద్ది జిత్తు పెరిగి పెద్దిది అయ్యింది . అది ఏనాడూ ఇంటిని , ఆచుట్టు పక్కల ప్రాంతాన్ని తప్ప ఎక్కడికి వెళ్ళి ఎరుగదు . ఇంట్లోనే కట్టి పడేసి ఇంత తిండి పెట్టే వాళ్ళు .
రోజు పోలయ్య మేకల్ని , గొర్రెలను మేపడానికి తీసుకెళ్లుతున్నప్పుడు . మందగ పోతున్న వాటిచూసి మాకు మంద లేదు.మావి ఒంటరి బతుకులే అని అల్లోచిస్తూ.. తనను తీసుకెళ్లలేదని కూని రాగాలు తీసి దీనంగా చూసేది . అలా చూసి చూసి దానికి ఒక ఆలోచన వచ్చింది . ఈ మనుషులు మా జాతిని కాపలా వాళ్ళుగా మార్చి స్వేచ్చ లేకుండా చేయడమే కాక ,కోపం వస్తే ఒకరిని ఒకరు కుక్కబతుకు అని , పిచ్చి కుక్క అని , ఊరకుక్క అని తిట్లను కని పెట్టి తిట్టుకుంటూ౦టారు, ఈ మనుషులకు బుద్ది చెప్పాల్సిందే . దీనికి ఒక్కటే పరిష్కారం ,మా జాతీ నంతతిని సమావేశ పరచి సమస్యను పరిష్కరించాలి అనుకుంది . ఇక్కడ నుoడి ఎలాగైనా తప్పించుకుని పోయి నా జాతి వాళ్లందరిని కలవాలి అనుకుంది .
ఒకరోజు జిత్తుకు అవకాశం రానే వచ్చింది . ఇంటి ను౦డి వెన్నక్కి తిరిగి చూడ కుండా బయటకు పరిగెట్టింది సంతోషంతో . చాలా దూరం వచ్చాక అక్కడ కొన్ని వీధి ఊరకుక్కలు జిత్తు కొత్తగా వచ్చిందని దాన్ని గట్టిగా మొరుగుతూ కొరపళ్లతో మీదికి దూకాయి . అనుకోని ఈ పరిణామానికి బిత్తర పోయిన జిత్తు వేగంగా పరుగు లంకించుకుని ఎలాగో బయటపడి .. ఇదేనా నా జాతి లక్షణం అనుకుంటూ ఒక పక్క తన లక్ష్యసాధన గుర్తు తెచ్చుకునిన ముందుకు సాగిపోగ అక్కడ ఒక కుప్పతొట్టి దగ్గర కొన్ని కుక్కలు ఎంగిలి విస్తర్ల కోసం కాట్లాడుకుంటున్నాయి , పక్కనే ఒక అతను వాటి కర్రతో అదిలిస్తున్నాడు . అది చూసిన జిత్తుకి అర్థమైంది . ఈ లోకంలో ఈ మా ఐకమత్యం లేని ఒకరికొకరు పడని జాతి , గొర్రెలలోని ఐకమత్యం వీటికి వుంటే ఎప్పుడో మందగా జీవించి వుండేవి ..అందుకే మా జాతి చేసే పనులు చూసి మనుషులు తిట్టే తిట్లను కనిపెట్టి వుంటారు.... ఛత్.... వీటిని మార్చడం అంటే మా వంకర తోక సరి చేసుకోవడమే,అవుతుంది . దీనికంటే విశ్వాసం గల జంతువుగా వుండడం మంచిది, అందుకు ఇల్లే పదిలం అని ఇంటి వైపు పరుగుతీసింది .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి